గత ఎన్నికల అనుభవంతో సీఎం కేసీఆర్ ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది..
అయితే రాజకీయ చైతన్యాల గుమ్మం ఖమ్మం ఓటరు నాడి కనిపెట్టడం అంత తేలికైన పని కాదని కొందరు పేర్కొంటున్నారు..
గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా కారు దూసుకుపోయింది… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటరు అందుకు భిన్నంగా కాంగ్రెస్కు జై కొట్టాడు.. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కారు గుర్తుపై గెలవగలిగారు.. అందుకే ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం లోని ఐదు నియోజకవర్గాల్లో మహాసభలు పెట్టి ఇక్కడి ఎన్నికల ఫలితాలను మలుపు తిప్పాలని వ్యూహరచన చేశారు…

ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. దానికి తోడు బి ఆర్ ఎస్ లో అసమ్మతి నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ మరింత బలపడింది.. దానికి తోడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వామపక్ష పార్టీలతో కూడా కాంగ్రెస్ ఎన్నికల పొత్తు దాదాపు ఖరారవుతుంది.. పొత్తు ఖరారు అయితే కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకి మరింతగా దోహదపడతాయని పరిశీలకులు అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ఈనెల 27 నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు వ్యూహ రచన చేశారు.బి ఆర్ ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. . 27న పాలేరు నియోజకవర్గంలో, వచ్చే నెల ఒకటవ తేదీన సత్తుపల్లి , ఇల్లందు నియోజకవర్గాల్లో మహాసభలు సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. అదేవిధంగా నవంబర్ 5వ తేదీన కొత్తగూడెం , ఖమ్మం నియోజకవర్గంలో కెసిఆర్ భారీభారీ బహిరంగ సభలో పాల్గొంటారు..
….. ఉమ్మడి ఖమ్మం పై కాంగ్రెస్ అగ్ర నేతల ప్రత్యేక దృష్టి…

ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేతలకు కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్ర త్వరలో ఉంటుందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది అదేవిధంగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సభలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కలిసి కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు.
అటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఇటు బి ఆర్ఎస్ ఇప్పటికే అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కు అదనంగా కొత్త కొత్త ఆకర్షణీయమైన పథకాలతో ప్రజల ముందుకు వస్తోంది. మరి ఖమ్మం జిల్లా ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఎవరికి జై కొడతారో వేచి చూడాల్సి ఉంది.
