జాతీయం తెలంగాణ రాజకీయం

పాలేరు సీటు సిపిఎం కు కేటాయిస్తారా…ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు..!పాలేరు పై కొత్త చర్చ..మోగిన ఎన్నికల నగారా .. విడుదలైన షెడ్యూల్..

Written by Mohiddin Shaik

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించి బి ఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఇంకా ఆలస్యం అవుతుందంటున్నారు.. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ని పాలేరు నియోజకవర్గం పై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.. పాలేరు నియోజకవర్గం సిపిఎం పార్టీకి కేటాయిస్తారని ఆసక్తికర చర్చ జరుగుతోంది… వామపక్షాలతో పొత్తు ఖరారు అయితే తమకు పాలేరు కేటాయించాలని సిపిఎం కోరుతున్నట్లు తెలుస్తోంది.. మరోపక్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పాలేరు నియోజకవర్గం టికెట్టు కోరుతున్న విషయం తెలిసిందే… ఇదిలా ఉంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం ఒకపక్క జరుగుతుంది.. అదే సందర్భంలో మరోపక్క పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో ఉన్నారు… ఇప్పుడు తాజాగా పాలేరు సిపిఎంకు కేటాయిస్తారని కొత్త చర్చ ఆసక్తిని రేపుతోంది…

… . మోగిన ఎన్నికల నగారా..

ఎన్నికల సంఘం సోమవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, చత్తీస్గడ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో చివరి దశలో తెలంగాణలో ఒకే విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నవంబర్ మూడవ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబర్ 10 నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ . 13న పరిశీలన , 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.నవంబర్ 30వ తేదీన ఎన్నికలు , డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో మూడు కోట్ల 17 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..

… … పాలేరు సీటు సిపిఎంకు కేటాయిస్తారా…

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్లో చేరిన బలమైన నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా పాలేరు నియోజకవర్గం తమకు కేటాయించాలని కోరుతున్నారు. తుమ్మల గతంలో పాలేరు నియోజకవర్గ నుంచి ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పక్షాన భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ ఆ తర్వాత జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కాగా తాను ఆ నియోజకవర్గంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో అభివృద్ధికి పాటుపడ్డానని అందుకే ఆ నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని తుమ్మల కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. మొన్నటివరకు పొంగులేటి కూడా పాలేరు తన కేటాయించాలని కోరినప్పటికీ ఇటీవల తనను కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఒకపక్క పొంగిలేటి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండగా మరోపక్క ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల లో జాప్యం జరుగుతున్నందునే స్పష్టత లేక అభ్యర్థులు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు ఎక్కడ గట్టిగా ప్రచారం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా సిపిఎం కు కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గం టికెట్ కేటాయిస్తుందని ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

….. దసరా తర్వాతే కాంగ్రెస్ జాబితా….

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా దసరా పండుగ తర్వాతనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కూడా 70 మంది అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు ఒక లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది అవునో, కాదో , తెలియని పరిస్థితి. ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి టికెట్లపై స్పష్టత ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకరు మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క కాగా మరొకరు భద్రాచలం నుంచి పో దెం వీరయ్య. కాగా సత్తుపల్లి నుంచి డాక్టర్ మట్ట దయానంద్ సతీమణి రాగమయి పేరు కూడా దాదాపు ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని ప్రచారం చేసుకోవాల్సిందిగా అధిష్టానం నుంచి సంకేతాలు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఎన్నికల షెడ్యూలు విడుదలైనందున, దాదాపు ఎన్నికల రణానికి , పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైనట్లు లెక్క. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు , ఆయా పార్టీల గెలుపు కోసం , వ్యూహాలు ,ఎత్తులు , జిత్తులు , పొత్తులు , అన్ని రకాలుగా సిద్ధమై యుద్ధ రంగంలోకి దిగనున్నాయి.

About the author

Mohiddin Shaik

Leave a Comment