ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం

పాలేరులో శీనన్న పర్యటనలు…ఆత్మీయ పలకరింపులు, పరామర్శలు… ఖమ్మం రూరల్ లో ఘన స్వాగతం పలికిన సిపిఐ శ్రేణులు… గాంధీ, షాహిన్,జానీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ…

Written by Mohiddin Shaik

మాజీ ఎంపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శీనన్న పర్యటనలు పాలేరు నియోజకవర్గంలో సాగుతున్నాయి… ఆదివారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు… ఖమ్మం రూరల్ మండలంలో సిపిఐ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది… ప్రధానంగా సిపిఐ బలంగా ఉన్న కామంచికల్లు , రామన్నపేట గ్రామాల్లో శనివారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా భారీగా సిపిఐ శ్రేణులు స్వాగతం పలికాయి… కాగా ఆదివారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామంచికల్లు గ్రామం వచ్చిన సందర్భంగా సిపిఐ గ్రామ కార్యదర్శి బొప్పి గాంధీ, సిపిఐ యువ నాయకుడు షాహిన్, అతని సోదరుడు జానీ, సిపిఐ మహిళా నాయకురాలు శారద, మాజీ ఎంపీ టి సి మోహన్ రావుల ఆధ్వర్యంలో శీనన్నకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు… సిపిఐ పార్టీకి బలమైన క్యాడర్ కలిగిన కామంచికల్లు గ్రామంలో బిఆర్ఎస్ తో సిపిఐ శ్రేణులకు నాయకులకు రాజకీయపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి.. గతంలో సిపిఐ ఓట్లతో గెలిచిన గ్రామ సర్పంచ్ మేదరమెట్ల శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ ప్రభాకర్ బి ఆర్ ఎస్ పార్టీలో చేరడంతో సిపిఐ పార్టీకి బీఆర్ఎస్ తో విభేదాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తు ఖరారు కానప్పటికీ సిపిఐ ఖమ్మం రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలవబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే శనివారం తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇదే సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తుమ్మలకు స్వాగతం పలికారు., పండుమియాను మాజీ మంత్రి తుమ్మల శనివారం పరామర్శించారు. అదేవిధంగా ఆదివారం సాయంత్రం కామంచికల్లు సిపిఐ యువ నాయకుడు షాహిన్, అతని సోదరుడు జానీల తండ్రి పండు మియాను పొంగులేటి పరామర్శించేందుకు వచ్చారు. పండు మియా ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. పాలేరు నియోజకవర్గంలో అనేక మందిని ఆత్మీయంగా కలుసుకొని పలకరించడంతోపాటు వివిధ ఆరోగ్య సమస్యలతో ఉన్న వారిని పరామర్శించే క్రమంలో పొంగులేటి కామంచికల్లు గ్రామంలో పర్యటించారు

కామంచికల్లు సిపిఐ గ్రామ కార్యదర్శి బి గాంధీ, ఆ పార్టీ యువజన నాయకుడు షాహిన్ అతని సోదరుడు జానీ, ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామంచికల్లు గ్రామానికి వస్తున్న సందర్భంలో ఎదురేగి స్వాగతం పలికి భారీ ర్యాలీగా గ్రామాల్లోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జానీ ఆధ్వర్యంలో పదిమందికి శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయం కూడా చేసినట్లు సమాచారం.

….. పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేస్తారా…!

కాంగ్రెస్ పార్టీ పక్షాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగూడెం నియోజకవర్గ కానీ, లేదా పాలేరు నుంచైనా తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తనకు పాలేరు నియోజకవర్గం కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే ప్రకారం ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే కాంగ్రెస్కు మేలు జరుగుతుందని, పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని సర్వే ద్వారా తెలిపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఖమ్మం నగరంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి పలు కుటుంబాలను కలుసుకొని ,పరామర్శలు ,పలకరింపులు జరిపారు. కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం లో పర్యటిస్తూ , అందరిని ఆత్మీయంగా కలుసుకుంటున్నారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన , తరువాతనే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు స్పష్టం అవుతుంది. కానీ పాలేరు నుంచి కాంగ్రెస్ పక్షాన ఎవరు పోటీలో ఉన్న , సిపిఐ ప్రధానంగా ఖమ్మం రూరల్ మండలంలో బి ఆర్ ఎస్ తో ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్ ను బలపరచడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. పొంగులేటి కార్యక్రమంలో నాయకులు పల్లె నరసింహారావు, సత్తి, యాసారపు నాగేశ్వరరావు, జంగాల ఉపేందర్, జంగాల వెంకటస్వామి, పుల్లారావు , వెంకటకృష్ణ , ఉదయ్, కె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment