సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజా సంఘాలను, మీ వైఫల్యాలను ప్రశ్నించడానికి వచ్చే విపక్ష నాయకులను నిర్బంధించి సభలు నడుపుకోవడం గొప్పతనం కాదు.. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను విమర్శించే ముందు దేశ ప్రగతి కోసం కాంగ్రెస్ వేసిన పునాదుల ను మరచిపోవద్దు… దేశంలో ఉన్న భారీ నీటి ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ నిర్మించినవే… బ్యాంకుల జాతీయకరణ నుంచి దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం కాకుండా కాంగ్రెస్ కాపాడితే , నేటి ప్రభుత్వాలు ప్రభుత్వ సంపద,ను ప్రైవేటు పరం చేస్తున్న విషయాన్ని మేధావులు , ప్రజలు గమనిస్తున్నారు… రాష్ట్రంలో పేదవాడికి తలదాచుకునేందుకు ఇల్లు ఇవ్వలేని బారాస ప్రభుత్వం , కాంగ్రెస్ ను విమర్శించడం సిగ్గుచేటు… అమెరికా ఐటీ కంపెనీలకు మనవాళ్లు సీఈవోలుగా ఉన్నారంటే, దానికి పునాదులు వేసింది కాంగ్రెస్… గుండు సూది కూడా తయారు చేయలేని స్థాయి నుంచి దేశం చంద్రయాన్ వరకు ఎదిగిందంటే పునాదులు వేసింది కాంగ్రెస్ .. అంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్
విమర్శలకు కౌంటర్ ఇచ్చారు..
….కేటీఆర్ మీ భాష మార్చుకోవాలి…
కేటీఆర్ మీ భాష మార్చుకోవాలి. మీరు ఎంత మందిని నిర్బంధించిన, ఎన్ని సభలు నిర్వహించిన , ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం.. పోలీసులు ద్వారా మీ బెదిరింపులకు ప్రజలు భయపడరు అని భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సభల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చేసిన విమర్శలకు విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ప్రజలు బాగుపడాలని .అందుకే వారి సంపదను వారికే పంచేందుకే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయబోతుందని విక్రమార్క పేర్కొన్నారు.
. బ్యాంకుల జాతీయకరణ నుంచి, భారీ ప్రాజెక్టుల నిర్మాణం వరకు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యపడ్డాయని ఆయన తెలిపారు. దేశ సంపదను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు కాంగ్రెస్ పాటుపడితే , ప్రస్తుత పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాయని, ఈ విషయం దేశవ్యాప్తంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసని, గమనిస్తున్నారని అన్నారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశం సమగ్రాభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ బలమైన పునాదులు వేసిన విషయం ప్రజలకు తెలుసునని బట్టి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను కేటీఆర్ గొర్రెలతో పోల్చి అవమానపరిచారని, అది ఆయన అహంభావానికి నిదర్శనం అని అన్నారు.

…కాంగ్రెస్తో పోల్చితే బి.ఆర్.ఎస్ ఆవగింజంత మాత్రమే..
దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో విఆర్ఎస్ పార్టీని పోల్చుకోవడం సరికాదన్నారు అలా పోల్చితే వీఆర్ఎస్ ఆవగింజంతే ఉంటుందని బట్టి ఎద్దేవా చేశారు.మీ ప్రభుత్వం దళితులకు మూడెకరాలు ఇస్తానన్నది ఎక్కడ ఇచ్చారు, ప్రతి పేదవాడికి డబల్ బెడ్ రూమ్ అన్నారు ఎవరికి ఇచ్చారు అంటూ నిలదీశారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కొత్త కొత్త పథకాలను తెరమీదకు తెస్తూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను కర్ణాటకలో అమలు చేసి చూపిస్తున్నామని ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని తెలంగాణలో నూరు శాతం అమలు చేసి తీరుతామని బట్టి స్పష్టం చేశారు. ప్రజలు ఆ గ్యారెంటీలను నమ్ముతున్నారనే విషయం తెలిసి కేటీఆర్ భయపడుతున్నారని అందుకే కాంగ్రెస్పై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
…. రాష్ట్రంలో 80 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది….
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని బట్టి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నియంతృత్వ పాలనలో విపక్షాలకు ప్రజలకు ఆయనతో మాట్లాడే అవకాశం లేదని కనీసం ప్రభుత్వ నిర్ణయాలను స్థానిక శాసనసభ్యులు కూడా వారి నియోజకవర్గాల్లో స్వయంగా చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదని బట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా త్వరలో వస్తుందని ఆయన చెప్పారు. ఆలస్యం అయితే తమ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వలస వెళతారనే భయంతో కేసిఆర్ ముందస్తుగా అభ్యర్థుల జాబితా ప్రకటించారని ,ఆ భయం తమకు లేదని బట్టి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్, టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, పుచ్చకాయల వీరభద్రం, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలాజి నాయక్,జిల్లా కిసాన్ కాంగ్రెస్, మైనారిటీ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చోటా బాబా, మద్ది వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
