ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం

నేడు కేటీఆర్ మంత్రుల సుడిగాలి పర్యటన…ఎట్టకేలకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన..వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు..వివరాలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

Written by Mohiddin Shaik

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం మంత్రులు కేటీఆర్ ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి సుడిగాలి పర్యటన చేయనున్నారు..
కొన్ని చర్ల మండలం గుబ్బ గుర్తి గ్రామ సమీపంలో గోద్రెజ్ కంపెనీ నిర్మించబోయే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గోద్రెజ్ కంపెనీ ఆయిల్ ఫామ్ మొక్కలను ప్రభుత్వ సబ్సిడీలు పొంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది ఎకరాల్లో తోటలు పెంచుతున్నారు. ఆయా తోటల నుంచి వస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్రూట్ మన జిల్లాలోని ఆయిల్ ప్రోడక్ట్ చేయాల్సి ఉండగా ఆంధ్ర కంపెనీలకు ఫ్యాక్టరీలకు తరలిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం లభించకుండా పోతుంది. గోద్రెజ్ కంపెనీ ప్రభుత్వానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇదివరకే ఆ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో నెలకొల్పి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు గుబుగుర్తి సమీపంలో సదరు కంపెనీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మంత్రి కేటీఆర్, మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు . వీరితోపాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , పలువురు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ,

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కేటీఆర్ మంత్రుల బృందం ఖమ్మం తో పాటు వైరా , భద్రాచలం , సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో వందలాది కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు చేయనున్నారు. ఖమ్మంలో 1350 కోట్ల రూపాయల నిధులతో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు . అదేవిధంగా ఖమ్మం గొల్లపాడు ఛానల్ పై నిర్మించిన పార్కులను, పలు ప్రారంభోత్సవాలను కేటీఆర్ చేయనున్నారు …
లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ పార్కును ప్రారంభించి, అమృత్ పథకం కింద నిర్మించబోతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి శంకుస్థాపన చేస్తారు.

…. తీగల వంతెనకు శంకుస్థాపన…

మున్నేరుపై రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కింద కోట్ల రూపాయలతో నిర్మించబోయే తీగల వంతెనకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను ఆయన తిలకిస్తారు . ఆ తరువాత భద్రాచలం లో గోదావరి కరకట్టకు 38 కోట్లతో నిర్మించే పనులకు కూనవరం రోడ్డులో శంకుస్థాపన చేస్తారు. అంబేద్కర్ సెంటర్లో సెంటర్ లైటింగ్ ను ఆయన ప్రారంభిస్తారు.

…… సత్తుపల్లిలో బహిరంగ సభ. ..

మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సత్తుపల్లి లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.
మంత్రుల పర్యటన వివరాలను శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాకు వివరించారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు . ఖమ్మం నియోజవర్గ అభివృద్ధి పై ఇదివరకే కేటీఆర్ కెసిఆర్ తమ అభినందనలు తెలియజేశారని చెప్పారు . ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు ఖమ్మం అభివృద్ధిని చూసి వెళ్లారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment