వెయ్యి మంది పూర్వ విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత ఒక్క చోట కలిస్తే, అంతకంటే ఆనందం ఏముంటుంది.. ఉరుకులు పరుగులతో సాగే, ప్రస్తుత సగటు మనిషి జీవితం, అనుబంధాలు, ఆప్యాయతలు, స్నేహం వంటి బంధాల విషయంలో కొంత వెనుకబడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే, .. అందుకే విద్యార్థి దశలో స్నేహంగా, ఆటపాటలతో సాగిన జీవితాలు, ఆ తరువాత వచ్చిన మార్పులు అన్నింటిపై ఇప్పుడు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులంతా, ఒక్కచోట చేరి తమ అనుభవాలను , ఆనందాలను, పంచుకునేందుకు ఒక అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసుకున్నారు…ఆ కార్యక్రమం వివరాలను వారే ఇలా వివరించారు..
అక్టోబర్ 1వ తేదీన గవర్నమెంట్ శాంతినగర్ హైస్కూల్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థి సంఘం గౌరవ అధ్యక్షులు కర్నాటి కృష్ణ, అధ్యక్షులు భోగా గిరి, ప్రధాన కార్యదర్శి ఎం ఏ తౌపిక్ తెలిపారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1975 నుండి 1985 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమయ్యే మహా సమ్మేళనం పార్క్ కన్వెన్షన్స్ ఆల్ (గొరిల్లా పార్క్)లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ మహా సమ్మేళనానికి 40 సంవత్సరాల క్రితం చదువుకున్న దాదాపు 1000 మంది విద్యార్థులు ఒకే చోటికి చేరి వారి అనుభవాలను పంచుకుంటారని,
…పూర్వ విద్యార్థుల్లో మంత్రులు శాసనసభ్యులు…
ఈ మహా సమ్మేళనానికి పూర్వ విద్యార్థులైనా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధులతోపాటు అనేకమంది ప్రజాప్రతినిధులు వివిధ హోదాలలో ఉన్న పూర్వ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమ్మేళనంలో తమకు విద్య నేర్పి తమ భవిష్యత్తును నిర్దేశించిన గురువులకు కృతజ్ఞతా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సలహాదారులు ఏఎస్ఆర్ కాలేజీ మాజీ చైర్మన్ బానోతు బస్కి నాయక్,23వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ కె మక్బుల్, మాజీ కౌన్సిలర్ పిల్లి విజయపాల్, లాయర్ వంజాకు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ టీచర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు కె.ఎస్ నాయుడు,, ఉమ్మినేని రాంబాబు, జయరాజ్, అబ్దుల్ ఖలీక్, భవాని, పిల్లలమర్రి శ్రీనివాస్, శ్రీగాధ శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, గౌస్ బాయ్, విలేకరి సివిఆర్ శ్రీనివాస్, విలేకరి భూపాల్, విలేకరి జనార్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.
