తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది.. సోనీ అమ్మ ఇచ్చిన గ్యారెంటీ కార్డును మూడు నెలలు భద్రంగా ఉంచండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిపై ఉన్న పథకాలన్నిటిని కచ్చితంగా పొందుతారు.. ఆ కార్డు ఆషామాషీ కార్డు కాదు.. వంట గ్యాస్ 500 కే ఇస్తాం.. ప్రతి ఇంట్లో ఒక మహిళకు నెలకు 2,500 పొందండి.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ.. ఎకరానికి 15000 పంట సాయం.. కౌలు రైతుకు కూడా 12000 వ్యవసాయ కూలీలకు 12000… గ్యారంటీ కార్డు పై ఉన్న ప్రతి పథకం ఆ కార్డు చూపించి నూరు శాతం పొందవచ్చు.. ఇవి గాక కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచే అనేక పథకాల గురించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు..
తనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం గర్వంగా ఉంది అని మాజీ మంత్రి తుమ్మల పేర్కొన్నారు.. గ్రూప్ వన్ పరీక్షలు హైకోర్టు రద్దు చేయడం వి ఆర్ ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లీకేజీలన్నీ ప్రభుత్వ వైఫల్యాలు అన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత మరో ముఖ్య నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో గెలుపు పై ధీమా మరింత పెరిగింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా జూపిల్లి కృష్ణారావుతో పాటు అనేకమంది ముఖ్యమైన నాయకులు బి.ఆర్.ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతుండడంతో ఆ పార్టీలో అధికారంలోకి రావడం ఖాయం అనే నమ్మకం పెరిగినట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా సోమవారం ఖమ్మానికి వచ్చి జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు .ఈ సందర్భంగా సిఎల్పీ నేత బట్టి, విక్రమార్క మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు నేతలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు
ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డెబ్బై నాలుగు స్థానాల నుంచి 80 స్థానాలకు పైగా గెలుచుకుని అధికారం చేపడుతుందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లు మాదిరిగా ఇచ్చిన గ్యారెంటీ కార్డు పై చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపులో నూరు శాతం అమలు చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో అమలు చేసి చూపిస్తున్నామని అదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచే వాగ్దానాలకు అదనంగా వరంగల్ డిక్లరేషన్ లో రాజీవ్ గాంధీ చేసిన వాగ్దానాలు ఆ తర్వాత ప్రియాంక గాంధీ చేసిన వాగ్దానాలకు అదనంగా గ్యారంటీ కార్డులో పొందుపరిచిన వాగ్దానాలు అమలు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. వీటి అమలుకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అని బి ఆర్ ఎస్ నేతలు చేస్తున్న వాదన కు ఆయన సమాధానం చెబుతూ తెలంగాణలో సంపద ఉంది అని ఆ సంపదను ప్రజలకు పంచుతామని చెప్పారు. కెసిఆర్ మాదిరిగా అబద్ధపు వాగ్దానాలు దళితుడికి మూడు ఎకరాలు, ప్రతి ఇంటికి ఉద్యోగం, దళితుడికి ముఖ్యమంత్రి పదవి, వంటి అంచనా లేని వాగ్దానాలు కాంగ్రెస్ చేయదని బట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్లో అపారమైన పాలన అనుభవం కలిగిన మేధావులు ఆర్థికపరమైన విషయాలపై స్పష్టమైన విజన్ కలిగిన నాయకులు చాలామంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి అనుభవం కలిగిన నాయకులు చేరికతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మరింత బలపడిందని అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు మల్లారని బట్టి పేర్కొన్నారు…
…. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం గర్వంగా ఉంది… తుమ్మల

కాంగ్రెస్ పార్టీలోకి తనను జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయి నాయకుల వరకు సాదరంగా ఆహ్వానించడం తనకు గర్వంగా ఉందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితం ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదని , తెరిసిన పుస్తకం లాంటిదని తుమ్మల అన్నారు. తాను ఏది చేసినా, ఏ పార్టీలో పనిచేసిన ప్రజల ప్రయోజనాల కోసమే నని ఆయన పేర్కొన్నారు. విక్రమార్క తో సహా కాంగ్రెస్ లోని పెద్దలు అందరితో కలిసి ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తుమ్మల అన్నారు..
….. విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం… పొంగులేటి..
గ్రూప్ వన్ పరీక్షలతో సహా అనేక పరీక్షల్లోనూ జరిగిన లోపాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యూహాత్మక వైఫల్యాల వల్ల నిరుద్యోగులు విద్యార్థుల జీవితాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. గ్రూపు వన్ పరీక్షలను హైకోర్టు రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన అన్నారు. కచ్చితంగా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుందని ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తుందని పొంగులేటి అన్నారు. పాత్రికే సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ , జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు ఎండి జావేద్ , నగరంలోని కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న నేతలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
