ఎన్నికల సీజన్లో నేతల పంచు డైలాగులు ప్రజలు ఆసక్తిగా వింటారు… గురువారం ఖమ్మంలో వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్పై పొలిటికల్ పంచులు విసిరారు… వాటికి కౌంటర్ గా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆ వెంటనే ఆయన కూడా పొలిటికల్ కామెంట్స్ చేశారు.. పాత్రికేయులతో హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ 50 ఏళ్లలో చేయలేక పోయింది… ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం చేస్తది.. పోనీ ఇప్పుడు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణలో చెబుతున్నట్లు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు.. కాంగ్రెసోళ్లు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్ముతరా… కాంగ్రెస్ అధికారంలోకి రాదని వాళ్లకు కూడా తెలుసు… పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నరు… తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఎట్లుండే… వచ్చినంక ఎట్లుంది ..ప్రజలు గమనిస్త లేరా… తెలంగాణ అన్నింటిలో నంబర్ వన్.. పంట పండించడంలో , మెడికల్ కాలేజీ సీట్లలో ,ఐటి ఉత్పత్తుల్లో , గ్రామీణ అభివృద్ధిలో , పట్టణాభివృద్ధిలో , ఇలా అన్నింటిలో నెంబర్వన్ గా ఉన్నాం.. ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం ధాన్యం పంటలో పంజాబును దాటిపోయినం..
దేశంలో ఎక్కడైనా మంచి చేస్తే విపక్షాలు స్వాగతిస్తాయి.. కానీ మన దగ్గర ప్రాజెక్టు కడతానంటే అడ్డంకులు కల్పిస్తున్నయి… కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఆటంకాలు కల్పించారు… ఇటువంటి పనులు పగోళ్ళు కూడా చేయరు.. అయినా ప్రాజెక్టు కట్టినం ఇప్పుడు ఆ ప్రాజెక్టు దండగ అంటరు.. పాలమూరు రైతులు తమకు పండగ అంటున్నరు…
……. కాంగ్రెస్ ది తన్నుల సంస్కృతి..
కాంగ్రెస్ ది తన్నుల సంస్కృతి బి ఆర్ ఎస్ డి టన్నులకొద్దీ పంటలు పండించే సంస్కృతి.. కాంగ్రెస్ పాలనలో కరెంటు అడిగితే తన్నులు, విత్తనాలు అడిగితే తన్నులు, ఎరువులు అడిగితే తన్నులు, ఏం అడిగినా తనులే తిన్నరు రైతులు.. మా ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు ,భీమా, ఉచిత కరెంటు ,ఎరువులు, విత్తనాలు అన్ని అందుతున్నాయి.ప్రాజెక్టుల్లో నీళ్లు ..అందుకే పుష్కలంగా టన్నుల పంటలు పండుతున్నాయి అంటూ పంచు డైలాగులు వినిపించారు…
వచ్చే ఎన్నికల్లో నోబుల్స్ కు గోబెల్స్ కు మధ్య పోటీ జరగబోతుందన్నారు. నోబుల్ అంటే చెప్పింది నిజాయితీగా చేసి చూపించడం, గోబెల్స్ అంటే అబద్దాలను నిత్యం ప్రచారం చేయడం…మేము చెప్పింది చేస్తే , కాంగ్రెస్ అబద్దాలను ప్రచారం చేస్తుంది. దాన్ని ప్రజలు నమ్మరు అని హరీష్ రావు అన్నారు.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను తెలంగాణ అందిస్తుందని హరీష్ పేర్కొన్నారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు గోదావరి నీటిని పాలేరులో నింపడం ద్వారా ఎడమ కాలువ ఆయకట్టు మొత్తం రెండు పంటలు పండుతుందని ఆయన పేర్కొన్నారు.. ఖమ్మం ప్రజల కరుణ కేసీఆర్ కు కావాలని హరీష్ అభ్యర్థించారు..
… తెలంగాణ నీ జాగీరు కాదు ..ఇది సిద్దిపేట కూడా కాదు.. బట్టి విక్రమార్క కౌంటర్..

హరీష్ రావు పంచ్ డైలాగ్ లకు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క గురువారం సాయంత్రం కౌంటర్గా పొలిటికల్ కామెంట్స్ చేశారు..
ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 90 స్థానాలు మావే అనడానికి తెలంగాణ హరీష్ రావు జాగీర్ కాదు నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి ఖమ్మం సిద్దిపేట కాదు. రాష్ట్రంలో 90 సీట్లు మాట తర్వాత సంగతి ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసుకో.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టబోతున్నారు.. రాష్ట్రంలో దేశంలో ఉన్న భారీ నీటి ప్రాజెక్టులన్ని ఎవరు కట్టారు …నువ్వు కట్టావా.. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులను ఈరోజు వరకు పూర్తి చేయలేకపోయారు.. చేయకుండానే చేసినట్టు చెప్పుకుంటున్నారు.. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.. ఖమ్మంలో ఏది పడితే అది మాట్లాడటం మానుకోవాలి…అంటూ హాట్ కామెంట్స్ చేశారు.. ఇటు హరీష్ రావు అటు బట్టి విక్రమార్క చేసిన హాట్ కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఖమ్మంలో నర్సింగ్ కాలేజీకి హరీష్ రావు గురువారం శంకుస్థాపన చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ని కూడా ఆయన ప్రారంభించారు అదేవిధంగా మమత మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో కూడా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
