ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం రస బాసర ముగిసింది.
ఈనెల 17న హైదరాబాదులో జరగనున్న విజయభేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులను సమాయత్వం చేసేందుకు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం రచ్చ రచ్చగా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో బీసీలకు సీట్లు కేటాయించాలని అన్నారు . దాంతో మరి కొంతమంది కార్యకర్తలు అసలు వీహెచ్ ఎవరు ఆయనకు ఖమ్మం జిల్లాతో ఏం సంబంధం ఇక్కడొచ్చి ఎందుకు రాజకీయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. , అందులో కొన్ని చర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు విహెచ్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం గట్టిగా చేశారు అదే సందర్భంలో రేణుక చౌదరి వర్గానికి చెందిన శ్రీను తాను కూడా బీసీనేనని అయితే ఎక్కడ ఖమ్మంలో వచ్చిన రాజకీయాలు చేస్తావా అంటూ విహెచ్ ను ఉద్దేశించి అతను కూడా ప్రసంగాన్ని ఆడుకునే ప్రయత్నం చేశారు వారితో మరికొంతమంది గొంతు కలిపారు .విహెచ్ ప్రసంగాన్ని వేదిక వద్దకు వచ్చి మరీ అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వేదిక పైనున్న కొందరు నాయకులు వారించే ప్రయత్నం చేసిన పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. అదే సందర్భంలో హాజరైన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల్లో ఏ వర్గం కార్యకర్తల ఆ వర్గ నాయకునికి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు కొంతమంది బట్టి కి జై కొట్టగా మరి కొంతమంది రేణుకా చౌదరి నాయకత్వం వర్ధిల్లాలి, మరికొందరు పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి, రాయల నాగేశ్వరరావు నాయకత్వం వర్ధించ వర్ధిల్లాలి అంటూ కూడా నినాదాలు చేశారు కొద్దిసేపు సమావేశం మందిరంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలగజేసుకొని ఘర్షణ వాతావరణం చేశారు ఆయనతోపాటు మాజీ మంత్రి రేణుక చౌదరి కార్యకర్తలను వారించారు అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్ గా వచ్చిన మొహమ్మద్ ఆరిఫ్ ఆసిఫ్ ఖాన్ కూడా కార్యకర్తలను సముదాయించే ప్రయత్నాలు చేశారు.
