మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది …. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లోనూ అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ సంచలనం కలిగించింది … 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళవలసి రావడంతో తెలుగుదేశం శ్రేణులతో పాటు జాతీయస్థాయి నాయకులను సైతం విస్మయానికి గురిచేసింది .. చంద్రబాబు నాయుడును రిమాండ్ కు పంపకుండా వెంటనే బెయిల్ ఇప్పించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన సుప్రీంకోర్టు లాయర్ల బృందం అత్యంత పకడ్బందీగా దాదాపు ఒక రోజంతా వాదించినప్పటికీ ఫలితం దక్కలేదు … చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.. తమ నేతను అటువంటి స్థితిలో చూసి తట్టుకోలే నీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆగ్రహానికి ఆవేదనకు గురయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల కాగడాలతో ర్యాలీలు నిర్వహించారు రాజమండ్రి వెళుతున్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక కార్లు వచ్చి చేరుతుండడంతో పోలీసులు అప్రమత్తమై వారిని చేరకుండా ఎక్కడికక్కడికి కట్టడి చేసి అత్యంత కట్టుదిట్టమైన బంధువస్తుతో రాజమండ్రి జైలుకు తరలించారు.
…… చంద్రబాబు జైలుకు వెళ్లడం పై భిన్నమైన ప్రకటనలు వెలువడుతున్నాయి…
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం పై స్పందిస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువకుల విజయమని వైసిపి ట్విట్ చేసింది. అయినప్పటికీ దీన్ని ప్రభుత్వం వ్యక్తిగతంగా తీసుకోదని ప్రజలకు సత్యానికి ఎప్పుడు అండగా ఉంటుందని అందులో పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై తమ పోరాటం రాజ్యాంగబద్ధంగా కొనసాగుతుందని వైసిపి ఆ ట్వీట్లు పేర్కొంది….
ఇది ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు అరెస్టయి జైలుకు వెళ్లడం పై స్పందిస్తూ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఎన్టి రామారావు ఆనందంతో తాండవం చేస్తాడని ట్విట్ చేశారు… ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దీనిపై వ్యాఖ్యానిస్తూ సత్యం వధ ధర్మం చర అంటూ పేర్కొన్నారు.. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఇది జగన్ ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్టకు చేరాయని వ్యాఖ్యానించారు..
….. బాబు అరెస్టులు అమిత్ షా హస్తం ఉంది సిపిఐ నారాయణ…

…. బాబు అరెస్టులు అమిత్ షా హస్తం ఉంది సిపిఐ నారాయణ…
చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయడంలో జైలుకు పంపడంలో కచ్చితంగా కేంద్ర హోం మంత్రి అమీషా హస్తము ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా సంయుక్తంగా ఆలోచించి చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టించారని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి జైలుకు పంపిన విధానం సరైనది కాదని ఇది జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయమని ఆయన విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇలా భిన్నమైన అభిప్రాయాలు ప్రకటనలు వెలువడుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి గతంలోనూ ఓటుకు నోటు కేసుతో సహా పలు రకాల కేసులు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ అరెస్టయి జైలుకు వెళ్లడం మాత్రం ఇదే ప్రథమం.
అనేక చోట్ల కాగడాల ర్యాలీలు..

చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లడం పై తీవ్ర ఆగ్రహానికి లోనైనా తెలుగుదేశం కార్యకర్తలు ఆంధ్ర లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కాగడాలతో ప్రదర్శనలు చేసి తమ నిరసనను తెలియజేశారు చంద్రబాబు నాయుడు జైలు నుంచి త్వరగా బయటికి వస్తారని న్యాయం గెలుస్తుందని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు ఇదిలా ఉండగా సోమవారం ఆంధ్రప్రదేశ్ బందుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది రాష్ట్రవ్యాప్తంగా బందు నిర్వహించనున్నారు.
కొంప ముంచిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం…
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన
చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయినందున జైల్లో ఆయనకు
ప్రత్యేక రూమ్ ఏర్పాటు ,ఇంటి ఇంటి భోజనం మందులు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.
విజయవాడ కోర్ట్ నుంచి రాత్రి 9 .30 గంటలకు రాజమండ్రికి
భారీ బందోబస్తు మధ్య రోడ్ మార్గంలో చంద్రబాబును తరలించారు.
సిఐడి పోలీసులు జరిపిన సుదీర్ఘమైన విచారణలో సెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమైనట్లు నిర్ధారించారు . సిబిఐ మోపిన అభియోగం పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్ట్ ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్దారించుకొని చంద్రబాబుకు రిమాండ్ విధించింది…
చంద్రబాబు తరుపున సుప్రీం కోర్ట్ కు చెందిన ప్రముఖ లాయర్ సిద్దార్థ లూత్రా వాదించగా , సి ఐ డి తరుపున అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు . ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు వాదనలు సాగాయి. తీర్పు రాత్రి 7 గంటల తర్వాత వెలువడింది ..
ఢిల్లీ లాయర్ వాదనలు విన్న తర్వాత చంద్రబాబుకు బేలు దొరుకుతుందని తెలుగుదేశం వర్గాలు చివరి వరకు ఆశగా ఎదురుచూశాయి కానీ చివరకు జైలుకు వెళ్లక తప్పలేదు.
