రాజకీయంగా చారిత్రిక ప్రాధాన్యం కలిగిన సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పై కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు కనిపిస్తున్న వేళ ఆ సీటు ఎవరికి కేటాయిస్తారని విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది…కాంగ్రెస్ పార్టీ బలంగా చెబుతున్న విధంగా సర్వే ఆధారంగా అభ్యర్థిని కేటాయిస్తారా లేక ఏదైనా నాయకులు ప్రభావితం చేస్తే ఆ నాయకుడు చెప్పిన వ్యక్తికి సీటు కేటాయిస్తారా, అనే అంశంపై సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
. .. సర్వే ప్రకారం సీటు కేటాయిస్తే మట్టా దయానంద్ కి దక్కుతుందట…
కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అనుసరించిన యుహమ్ మాదిరిగానే తెలంగాణలో కూడా సర్వే ఆధారంగానే కాంగ్రెస్ అభ్యర్థుల కు సీట్లు కేటాయింపు జరుగుతుందని ఆ పార్టీ అధినాయకత్వం బలంగా చెబుతోంది. సత్తుపల్లి విషయంలో కూడా సర్వే ఆధారంగానే సీటు కేటాయిస్తారు అనే చర్చ జరుగుతుంది అలా కేటాయించి పక్షంలో డాక్టర్ మట్ట దయానంద్ కు గాని లేదా ఆయన క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో కొంత ఇబ్బంది ఉందనుకుంటే ఆయన సతీమణి డాక్టర్ మట్ట రాగమయికి గాని సీటు కేటాయించే అవకాశం ఉందని కొందరు పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా మాజీ ఎంపీ పొందిలేటి శ్రీనివాసరెడ్డి సూచిస్తున్న విధంగా కాంగ్రెస్ టికెట్లు కేటాయింపు చేస్తే సుధాకర్ కు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించగలిగిన వ్యక్తికే టికెట్ ఇస్తుందనే ప్రచారం బలంగా వినిపిస్తున్న సందర్భంలో మట్ట దయానంద్ కుటుంబం పూర్వాశ్రమంలో కాంగ్రెస్ కుటుంబం దయానంద్ తల్లి మట్ట ఆరోగ్యం ఆమె సత్తుపల్లి కాంగ్రెస్ పక్షాన ఎంపీపీగా సేవలందించారు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కాలం నుంచి వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జలగం కుటుంబంతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నది. ఇప్పుడు సైతం దయానందుకు గాని రాగమయికి గాని కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే జలగం ప్రసాదరావు, జలగం వెంకట్రావు ఆశీస్సులు సైతం దయానందుకు పుష్కలంగా ఉన్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే సందర్భంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పట్టు కలిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులు కూడా దయానందుకే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో దయానంద్ కుటుంబం నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలతో ఎన్నికలు ఉన్నా, లేకున్నా నిత్యం మమేకమై ఉండే కుటుంబం కావడం ఈ ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చే అంశంగా కొందరు పేర్కొంటున్నారు.
… ఎస్సీ మాదిగకు ఒక సీటు, ఎస్సీ మాలకు ఒక సీటు ఫార్ములా పనిచేస్తుందా…….
ఖమ్మం జిల్లాలో ఒక సీటు ఎస్సీ మాలకు మరొక సీటు ఎస్సీ మాదిగకు కేటాయించాలని ఫార్ములా పనిచేస్తుందా లేకపోతే గెలిచే వ్యక్తులు ఎవరో తేల్చి చెప్పే సర్వే ఫలితాలని ఆధారంగా చేసుకొని సీట్లు కేటాయిస్తారా అనే విషయంపై పరిశీలకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధిరలో ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్నందున సత్తుపల్లి నుంచి ఎస్సీ మాదిగ సుధాకర్ కు టికెట్ కేటాయించాలని అధినాయకత్వానికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఈ ఫార్ములా ద్వారా ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఉన్న మట్ట దయానంద్ గాని లేదా ఆయన సతీమణి రాఘమ గాని సీటు రాకుండా సుధాకర్ కు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దయానంద వర్గీల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ దయానందుకు సర్వే ఆధారంగా టిక్కెట్ కేటాయిస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతోపాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులు కూడా దయానందుకు పుష్కలంగా ఉన్నాయని అక్కడి కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్లో కొత్త ఊపు కనిపిస్తున్న సందర్భంలో ఆ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ వ్యవహారం తేలాలంటే మరి కొంతకాలం వీచి చూడాల్సిందే..
