ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

కల హించు కున్న నేతలు కౌగిలించుకున్న వేళ…ఒకప్పుడు వైరి వర్గాలుగా ఉండవచ్చు..తుమ్మల, శీనన్న కలయికపై ఆసక్తికర చర్చ..

Written by Mohiddin Shaik

రాజకీయం అంటే కడుపులో కత్తులు పెట్టుకునే కౌగిలించుకో నక్కరలేదు… ఉమ్మడి లక్ష్యం కోసం ప్రేమ ఆప్యాయతలతో కౌగిలించుకోవచ్చు… రాజకీయాల్లో ఒకప్పుడు కల హించుకోవడం, ఆ తరువాత మరోసారి అన్నదమ్ముల మాదిరిగా కలసిపోవడం అత్యంత సహజం..
ఇటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీలో ఉండి ఆధిపత్యం కోసం వైరి వర్గాలుగా పని చేశారని పేరు ఉంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలను తుమ్మల శాసిస్తున్న రోజులవి…
కానీ తాను కూడా తక్కువేమీ కాదని నిరూపించుకునేందుకు పొంగులేటినీ శ్రీనివాసరెడ్డి కూడా తన ప్రయత్నం తాను గట్టిగానే చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.. సీఎం కేసీఆర్ అది నిజమే అని భావించారు అనే ప్రచారం జరిగింది.

అంతెందుకు ఆ ఇద్దరూ ఆధిపత్యం పోరు వల్లే గులాబీ పార్టీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని గులాబీ బాస్ బలంగా నమ్మారు అనే చర్చ జరిగింది.
అప్పట్లో ఎన్నికల షాకింగ్ ఫలితాలపై కేసీఆర్ మాట్లాడుతూ ,మా కత్తులే మా పార్టీని పొడిచాయి అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి .అదంతా పాత ముచ్చ ట. ..

ఇప్పుడు శీను మారిపోయింది..

కానీ ఇప్పుడు శీను మారిపోయింది. గులాబీ బాస్ తమను విస్మరించారని, ఉమ్మడి జిల్లాలో లేని గులాబీ పార్టీని బలమైన పార్టీగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తే , మాకిచ్చే బహుమతి ఇదా , అంటూ ఆ నేతలు ఇద్దరూ ఆగ్రహంతో రగిలిపోయారు..
పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బి ఆర్ ఎస్ పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరగా , తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయలేదు, పైగా , బి ఆర్ ఎస్ కూడా తుమ్మలపై పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు..
కానీ ఆయన అభిమానులు , అనుచరులు, అంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆయన కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావును కలుసుకొని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం, ఈ సందర్భంగా ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని వారిద్దరూ ఒకరికొకరు చిరకాల మిత్రులు అంటూ ప్రకటించుకున్నారు..
దీంతో ఇరు నాయకుల అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తుండగా, ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరి కలిసికట్టుగా పని చేస్తారా, పని చేస్తే , బి ఆర్ ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

…. వీరిద్దరి పట్ల కెసిఆర్ నిర్ణయం సరైనదేనా…

ఆధిపత్య పోరు ఉంటే పక్కకు తోసేస్తారా, మరి ప్రస్తుతం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది ..ఒకే నియోజకవర్గంలో పార్టీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటారా ..! ఇది సరైన నిర్ణయం కాదేమో అని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇద్దరు నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు కానీ ఆధిపత్య పోకడలు కానీ రావడం రాజకీయాల్లో సహజమేనని , అటువంటి అప్పుడు అధినాయకత్వం ఆ ఇద్దరినీ పిలిచి సర్దుబాటు చేసి ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు తుమ్మల నాగేశ్వరరావు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కాంగ్రెస్లో చేరి కలిసికట్టుగా పనిచేస్తే బి ఆర్ ఎస్ కు ఏ రకంగా మేలు జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు . మొత్తం మీద ఆ ఇద్దరు నాయకుల కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

About the author

Mohiddin Shaik

Leave a Comment