ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

ఖమ్మం జిల్లాలో బి ఆర్ఎస్ నావ దరిచేరేది ఎట్లా…పొలిటికల్ మాస్టర్ కెసిఆర్ వద్ద ఉన్న వ్యూహం ఏమిటి..?పాలేరుకు కాబోయే పెద్ద పాలేరు ఎవరు.!సీట్ల కేటాయింపు తర్వాత మాస్టర్ ఆట మొదలు పెడతారు.గులాబీ నేతల ధీమా…

Written by Mohiddin Shaik

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి ఆర్ఎస్ నావను దరి చేర్చేందుకు పొలిటికల్ మాస్టర్ కెసిఆర్ వద్ద ఉన్న వ్యూహం ఏమిటి..
వలస పక్షులన్నీ హస్తం పార్టీ గూటికి చేరుతున్నాయి.. మారుతున్న సమీకరణలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి.. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పొలిటికల్ మాస్టర్ కెసిఆర్ అసలైన ఆట మొదలు పెడతారట.. పొలిటికల్ మాస్టర్ ఎన్నికల ఎత్తు వేశారంటే ప్రత్యర్థులు చిత్తయిపోవాల్సిందేనట.. మునుగోడు ఉపఎన్నికల సందర్భంలో బిజెపిలో చక్రం తిప్పే పేరుగాంచిన వ్యూహ కర్తలు, అమిత్ షా వంటి బడానేతల నోళ్లు మూయించిన ఘనత తమ మాస్టర్ దేనని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.. ఏక్నాథ్ సిండేలు తెలంగాణలో ఉన్నారు , కట్టప్పలు ఉన్నారు, ఇక తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుంది , చీల్చేస్తాం.. అంటూ మాస్టర్ను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారట… కానీ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన కాషాయ పార్టీ ఏజెంట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మాస్టర్ తన దమ్ము చూపించారు… ఆ దెబ్బతో ఏకనాథ్ షిండే , కట్టప్ప , డబల్ ఇంజన్ సర్కార్, ఈ నినాదాలు అన్ని మాయమై , ఆ పార్టీ జాతీయ నాయకుల సైతం కంగారు పడే పరిస్థితి వచ్చింది.. ఆ దెబ్బతో తెలంగాణ పొలిటికల్ మాస్టర్ దమ్ము ఏమిటో జాతీయస్థాయిలో తెలిసిపోయిందని వారు అంటున్నారు …పొలిటికల్ మాస్టర్ కెసిఆర్ ఎత్తు వేసి వారిని చిత్తు చేశారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు.. అలాంటిది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా తమ పార్టీని గెలిపించుకునేందుకు మాస్టర్ వద్ద బ్రహ్మాస్త్రం లాంటి వ్యూహం ఉందని వారు అంటున్నారు.. అది కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మాస్టర్ తన ఆటను మొదలు పెడతారని, అంతిమ విజయం తమదేనని గులాబీ పార్టీ నేతలు ది మా వ్యక్తం చేస్తున్నారు.

… మంత్రి అజయ్ కుమార్ ను ఢీకొట్టేది ఎవరు… !

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గులాబీ పార్టీకి ఈ జిల్లా నుంచి గెలిచి వెళ్లిన ఏకవీరుడు.. అందుకే ఆయనకు మంత్రి పదవి వరించింది . మంత్రి అయిన తర్వాత పార్టీలో వర్గ రాజకీయాలకు దూరంగా , పార్టీని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సూచనలతో అడుగులు వేస్తూ , ఎంపీ , కార్పొరేషన్ , స్థానిక ఎన్నికలు, కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలతో సహా అన్నింటిలోనూ గులాబీ జెండాను రెపరెపలాడించారు.. ఆ విజయాలన్నీ పొలిటికల్ మాస్టర్ కెసిఆర్ సూచనలతోనే ఆయన సాధించారు. కెసిఆర్ మనసు గెలవడమే కాక జిల్లాతో పాటు తన నియోజకవర్గంలోని ప్రజలు మనసు గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ ను ఢీకొట్టేందుకు దీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లలు పడుతుంది. మంత్రిని ఓడించే సత్తా ఏ అభ్యర్థి ఉంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ.. ఇదిలా ఉంటే మంత్రితో సహా ఉమ్మడి జిల్లా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడానికి అవసరమైన బ్రహ్మాస్త్రం లాంటి వ్యూహరచన ఏదో ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉందని మంత్రితో సహా గులాబీ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.. ఆ వ్యూహం ఏమిటో వలస పక్షులుగా చేరిన బడా నేతలు ఎవరు ఎక్కడ నిలబడతారు, చూశాక పొలిటికల్ మాస్టర్ తన ఆటను మొదలుపెట్టి , ప్రజలను ఆకర్షించి, ప్రత్యర్థులను కంగుతినిపిస్తారని వారు పేర్కొంటున్నారు..

…. పాలేరుకు కాబోయే పెద్ద పాలేరు ఎవరు…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజక వర్గం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అతిరథ మహారధులంతా ఇక్కడే పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీ చేస్తారని ఆయన వర్గీయులు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే సిపిఎం పక్షాన తమ్మినేని వీరభద్రం ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది, మరోపక్క బి ఆర్ ఎస్ సిట్టింగ్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి పేరుని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాగా వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి పాలేరు నుంచి పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక బి ఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ జిల్లాలో బి ఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే ని కూడా గెలవనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టి పి సి సి కి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో పాలేరులో పోటీ చేసి గెలిచిన సందర్భంలో తాను పాలేరు నియోజకవర్గానికి పెద్ద పాలేరు మాదిరిగా సేవ చేస్తానని ఒక బహిరంగ సభలో ప్రకటించారు. మరి రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి, పెద్ద పాలేరు మాదిరి సేవలందించేది ఎవరు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల ఇప్పటికే ఢిల్లీలో సోనియా గాంధీతో కలిసి మంతనాలు జరిపారు. ఆమె ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో తన క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా పాలేరు నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. మరి ఎవరు రంగంలో ఉంటారు, ఎవరు గెలుస్తారు ,అనే ఉత్కంఠకు తెర పడాలంటే ఎన్నికలయ్యే దాకా ఆగాల్సిందే…

About the author

Mohiddin Shaik

Leave a Comment