తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు చెందిన అనాధ బాలికల కోసం బాగా ఉపయోగపడే కస్తూర్బా గాంధీ విద్యాలయాల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది . ఇప్పటికే రాష్ట్రంలో 470 7 కేజీబీవీలు పనిచేస్తున్నాయి. కొత్తగా మరో 20 కేజీబీవీలను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వాటి సంఖ్య 497 కు పెరిగింది. ఇదివరకు ఉన్న పాఠశాలల్లో దాదాపు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం 15 వేలకు పైగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
…. కేజీ వివి సిబ్బందికి సమాన వేతనం ఎప్పుడు ఇస్తారు..!

కొన్ని రాష్ట్రాల్లో కేజీబీవీల్లో పని చేసే సిబ్బందిని అక్కడి ప్రభుత్వాలు రెగ్యులర్ చేశాయి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లేదా జీతాలను టైమ్ స్కేల్ ఇస్తూ అమలు చేయడం వంటివి కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎందుకు కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి కనీసం సమాన పనికి సమాన వేతనం అయినా ఇవ్వాలని వారు పోరాటాలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కరుణించడం లేదు. ఆయా విద్యాలయాల్లో నైట్ డ్యూటీ లతో సహా టీచింగ్ స్టాఫ్ వెట్టిచాకిరిని తలదన్నేలా కష్టపడుతున్న విషయం ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ వారి గోడు ప్రభుత్వం వినిపించుకున్న దాఖలాలు లేవు. ఇటీవలే గురుకులాల్లో పని చేసే కాంట్రాక్టు టీచర్లను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. దాంతో ముఖ్యమంత్రి తమ పట్ల కూడా కరుణ చూపి కనీసం టైం స్కేల్ అయిన అమలు చేస్తారని కేజీబీవీ లో పనిచేసే సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. వారికి కూడా నేడు రేపు ముఖ్యమంత్రి శుభవార్త చెబుతారని ఆశతో వారు ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వారికి తీపి కబురు ఎప్పుడు చెబుతారు వేచి చూడాలి
