ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

అమిత్ షా రైతు అస్త్రం కేసీఆర్ను తాకిందా.!రైతుకు బిజెపి ఇచ్చిన భరోసా ఏమిటి.!రైతు ఆదాయం రెట్టింపు కాలేదా.. రైతు భరోసా సభ పై రైతు వర్గాల్లో చర్చ..

Written by Mohiddin Shaik

అధికార పక్షంపై విపక్షాలు సంధించే విమర్శనాస్త్రాలు సూటిగా వెళ్లి రామ బాణంలా తగులుతాయి… కానీ కొన్ని అస్త్రాలు గోడకు కొట్టిన బంతిలా రివర్స్లో వచ్చి సంధించిన వారికే తగులుతాయి… మరి ఖమ్మం నగరంలో బిజెపి అగ్ర నేత అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం పై సంధించిన అస్త్రాలు సూటిగా రామబానోల్ల తగలలేదని చర్చ జరుగుతోంది … బిజెపి ఎంచుకున్న పోరాట అంశం తెలంగాణలో హిట్టుకొట్టేది కాదంటున్నారు పరిశీలకులు… దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే , తెలంగాణ రైతులకు అన్ని విధాల సహకారం ఎక్కువగానే అందుతుందని వారు అంటున్నారు… అలాంటప్పుడు రైతు గోస బీజేపీ భరోసా అంటే అది హిట్ అవుతుందా… బిజెపి భరోసా అంటే కెసిఆర్ ఇస్తున్న పథకాల కంటే గొప్ప పథకాలు ఏవైనా ఇస్తామని కనీసం ప్రకటన ఆయన చేయాలి.. 1150 రూపాయలు పలుకుతున్న గ్యాస్ సిలిండర్ ధరను తమ ప్రభుత్వం వస్తే 500 కి తగ్గిస్తామని కాంగ్రెస్ ప్రకటించినట్లు సూటిగా సుత్తి లేకుండా, రైతులను ఆకర్షించేలా , ఏదైనా గొప్ప పథకం ప్రకటించాలి.. కానీ అటువంటిది ఏది రైతు భరోసా సభలో ప్రకటించలేదు.. గత ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించింది.. మరి ఆ వాగ్దానం నెరవేర్చితే మళ్ళీ రైతు గోస పడాల్సిన అవసరమే ఉండదు కదా, అని అధికార బి ఆర్ ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.. అంటే రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేస్తారో కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్ద కార్యాచరణ లేదని వారు పేర్కొంటున్నారు. అలాంటిది తెలంగాణలో రైతులు గోసపడుతున్నారు , వ్యవసాయం దండగని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు , ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం , దీన్ని కూకటి వేళ్ళతో పీకి వేయండి అని పిలుపునిస్తే , ఆ పిలుపు రైతుల్లోకి ఎలా వెళుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.. రైతు గోస పేరుతో బిజెపి సంధించిన అస్త్రం అంతగా ఆ పార్టీకి ఫలితాలు ఇవ్వదని కొందరు విశ్లేషిస్తున్నారు.

…. తెలంగాణలోని తీవ్ర సమస్యను ఎంచుకుంటే బాగుండేది…

బిజెపి రైతు సమస్య కాకుండా తెలంగాణలో ప్రజలు ఎదుర్కొనే తీవ్ర సమస్యను ఎంచుకొని తమ ప్రభుత్వం వస్తే ఆ సమస్యను పరిష్కారం చేస్తుందని ప్రకటిస్తే ప్రజలు ఆలోచిస్తారు. అలా కాకుండా రైతుబంధు, సాగునీరు , ఉచిత కరెంటు , పంటల కొనుగోలు, రైతు భీమా, ఇవన్నీ క్రమం తప్పకుండా ఇస్తూ, కొత్తగా రైతుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చేందుకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం కేసీఆర్ రైతులకు మాత్రమే వీలైనంత మేలు చేసి తమను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు చేసే విమర్శ ఓ మత్తు తునక.

….. ఈ పథకాలతో రైతులు లక్షాధికారులు కాలేరు…

అంటే ఇవన్నీ రైతులకు
సరిపోతాయని అనాల్సిన పనిలేదు.. ఈ పథకాలతోటే రైతులు లక్షాధికారులు అ, వుతారని చెప్పలేం. ఇన్ని చేసిన రైతులు అప్పులు పాలు అవుతూనే ఉన్నారు. ఉద్దీపనలతో పొద్దు పోగొట్టడం వల్ల రైతుల నుదుటి రాత మారిపోదని రైతు సంఘాల నేతలు అంటున్నారు. వారికి నిజమైన భరోసా పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే. మరి బిజెపి భరోసా సభలో రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఏమి ఇవ్వలేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానం ఇంతవరకు ఆచరణ రూపం దాల్చలేదు. కానీ రైతు భరోసా అని భారీ బహిరంగ సభ పెట్టి అమిత్ షా స్థాయి అగ్ర నేతలు మళ్లీ పాత ప్రసంగాలే , చేశారని వారు పేర్కొంటున్నారు .రజాకార్లు ,రామదాసు జైలు, ఓవైసీ గొప్పతనం గురించి చెప్పడం వల్ల రైతులకు ఏం లాభం అని కొందరు రైతు సంఘం నాయకులు రైతులు చర్చించుకుంటున్నారు. హైదరాబాదు పాతబస్తీ లోను ,లేదా తెలంగాణలోని ఒకటి రెండు మతవాద సంఘాలు ఉన్న ప్రాంతాల్లోనూ తప్ప ఇతర జిల్లాల్లో పెద్దగా జనంలో చర్చలో లేని ఓవైసీ పార్టీ గురించి, ఓవైసీ గురించి అమిత్ షా ప్రసంగంలో ఆధ్యాంతం మాట్లాడడం వల్ల రైతులకు బిజెపి ఇవ్వదలుచుకున్న భరోసా ఏమిటో అర్థం కాలేదని చర్చ జరుగుతుంది.

……. సభ లక్ష్యం నెరవేరిందా..!

లక్ష మందితో రైతు భరోసా సభ ఖమ్మం లో ఏర్పాటు చేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది .ఆ లక్ష్యంలో ఎంతవరకు విజయం సాధించారు అనే అంశం పక్కన పెడితే, సభ లక్ష్యం నెరవేరలేదని చర్చ జరుగుతోంది . కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగాలతో బిజెపి కార్యకర్తలను ఉత్సాహపరిచి ఉండవచ్చు . కానీ ఆ పార్టీ రైతులకు తెలంగాణ సర్కారు కంటే, గొప్ప మేలు ఏమి చేస్తుందో స్పష్టంగా చెప్పలేదని అభిప్రాయాలు రైతుల్లో, పరిశీలకుల్లో, వ్యక్తం అవుతున్నాయి…

About the author

Mohiddin Shaik

Leave a Comment