ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం

ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా..పరాన్నజీవుల ఎత్తులు పనిచేయవు..గోదారి నీళ్ళతో కాళ్లు కడిగి విరమించుకుంటా.. తుమ్మల భావోద్వేగ ప్రసంగం.

Written by Mohiddin Shaik

కొంతమంది పరాన్న బుక్కులు ఎత్తులు వేసి ఉండవచ్చు.. అవివారికి కొంత శునకానందం కలిగించవచ్చు… కానీ నా జిల్లా ప్రజల కోసం , నన్ను అభిమానించే వారి కోసం కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాను… రాజకీయంగా నేను అనేకసార్లు కింద పడిపోతే మీరే మీ చేతులతో ఎత్తుకున్నారు… అరక దున్నుకునే నన్ను మంత్రిని చేసి నా మీ రుణం తీర్చుకోవాలి… నా కోరిక ఒక్కటే.. గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను… అంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన భావోద్వేగా ప్రసంగం ఆయన అభిమానులను ఆధ్యాంతం కట్టిపడేసింది.
తాను జిల్లాకు వస్తున్న సందర్భంగా తనకు ఎదురేగి అభిమానులు స్వాగతం పలికిన తీరును ప్రస్తావిస్తూ తుమ్మల భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తుమ్మల కన్నీటి తడి తన అభిమానుల గుండెలను తాకింది. జై తుమ్మల అంటూ అభిమానులు పదే పదే చేసిన నినాదాలతో ఆ ప్రాంగణం మారు మోగింది..

…. తుమ్మల వర్గంలో జ్యూస్ నింపిన భారీ కార్ ర్యాలీ…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుండి ఖమ్మం వస్తున్న సందర్భంగా నాయక్ గూడెం వద్ద ఆయన అభిమానులు దాదాపు 1000 కార్లు బైకులతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడనుండి బారుగూడెం లోని తన నివాసం వరకు ర్యాలీ కొనసాగింది భారీగా ర్యాలీకి జనం తరలి రావడం దారి పొడవునా తుమ్మలపట్ల కొందరు అభిమానం ప్రదర్శించడాన్ని గమనించిన తుమ్మల వర్గంలో జోష్ నింపినట్ల అయింది.

….. తుమ్మల కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనా…

తుమ్మల నాగేశ్వరరావు వర్గం మొత్తం ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు అభిమానుల ఒత్తిడి మేరకు ఆయన కాంగ్రెస్లో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తనకు పాలేరు కేటాయించాలని తుమ్మల కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరగా, ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తుమ్మల స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు ఆ జెండా పైన తుమ్మల బొమ్మ ఉన్న తెల్ల జండాలను ప్రదర్శించారు దీంతో తుమ్మల కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమైనట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనను విస్మరించిన గులాబీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా తుమ్మల కాంగ్రెస్కు వెళ్లి ఎన్నికల బరిలో నిలబడతారని ప్రచారం బలంగా వినిపిస్తోంది

About the author

Mohiddin Shaik

Leave a Comment