తెలంగాణ రాజకీయం

తుమ్మల హస్తానికి జై కొట్టినట్టేనా…పార్టీ మార్పుపై రాష్ట్రవ్యాప్త చర్చ..బుజ్జగింపులు రాయబారాలు పనిచేస్తాయా..తుమ్మల చెప్పిన వినేస్థితిలో క్యాడర్ లేదట…

Written by Mohiddin Shaik

మాజీ మంత్రి బి ఆర్ ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్లేనని తుమ్మల వర్గీయులు కొందరు చెబుతున్నారు. నేడు శుక్రవారం తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుండి ఖమ్మం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, అనుచరులు నాయక్ గూడెం నుండి భారీ ర్యాలీతో ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. 2000 కార్లు మరో రెండు వేల మోటార్ సైకిల్ తోటి, భారీ ర్యాలీ నిర్వహించాలని తుమ్మల వర్గీయులు సన్నాహాలు చేస్తున్నారు.. తుమ్మల నాగేశ్వరరావును ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేసి పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగించుకొని వదిలేసారని తుమ్మల వర్గీయులు మండిపడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి పై అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పొంగులేటి కాంగ్రెస్లో చేరినప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి అదే పార్టీలో కొనసాగుతున్నారు . ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పాలేరు టికెట్ ఇస్తారని ఆయన ఆశించారు. కానీ ఇప్పుడు కూడా నిరాశే మిగిలింది . దాంతో తుమ్మల వర్గీయులంతా బిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరాలని గత కొంతకాలంగా పట్టుబడుతున్నారు. మొన్న మొన్నటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరికపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరగగా, ఇప్పుడు తాజాగా అదే స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్లో చేరుతారు అనే అంశంపై చర్చ జరుగుతోంది.

…. తుమ్మల కాంగ్రెస్ లో చేరితే…

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరినట్లయితే ఆ పార్టీకి జిల్లాలో మరింత బలం చేగురుతుంది అనడంలో సందేహం లేదు. ఒక బలమైన సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ కి మరింత బలం చేకూరుతుందని కొందరు విశ్లే శిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదా పు అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఆయన అనుచరగనం కూడా ఉంది. అందుకే ఆయన పార్టీ మారకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన దూతగా ఎంపీ నామా నాగేశ్వరరావును పంపించి , తుమ్మలతో బుజ్జగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా మరికొంతమంది నాయకులతో తుమ్మల వద్దకు రాయబారాలు పంపించారు. కానీ అవి ఏవి కూడా ఫలించినట్లు కనిపించడం లేదు.

….. తుమ్మలపై ఒత్తిడి పెంచిన క్యాడర్….

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా తుమ్మలను ఆపేందుకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ కాంగ్రెస్ లో చేరే విషయంలో రెండవ ఆలోచన చేసినప్పటికీ, ఆయన అనుచరులు మాత్రం వెనక్కి తగ్గకూడదని ఆయనపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఎక్కువగా. కనిపిస్తున్నాయి . తుమ్మల అనుచరుల్లో కొంతమంది తుమ్మల వెనక్కు తగ్గిన తాము మాత్రం బి ఆర్ ఎస్ కు ఓటు వేసేది లేదని కాంగ్రెస్ వైపు వెళతామంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు . ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వరరావు చేరడం అనివార్యంగా మారుతుందని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే గతంలో ఒకే పార్టీలో భిన్న ధ్రువాలుగా ఉండి పనిచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి కలిసి పని చేస్తారా … అంటే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కలిసి పని చేయక తప్పదని కొందరు అంటున్నారు. మొత్తం మీద నేడు తుమ్మల నాగేశ్వరరావు భారీ ర్యాలీతో నాయకన్ గూడెం నుండి ఖమ్మం గొల్లగూడెం లో ఉన్న తన నివాసం వరకు భారీ ర్యాలీతో రానున్నారు . అనంతరం పార్టీలకు అతీతంగా తుమ్మల అభిమానులు వచ్చి ఆయనను కలవవచ్చని తుమ్మల వర్గీయులు కొందరు చెబుతున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment