జాతీయం తెలంగాణ

చందమామ అందిన రోజు..గగనాన్ని ముద్దాడిన రోజు..మహాకవి శ్రీశ్రీ ఊహ నిజమైన రోజు

Written by Mohiddin Shaik

చంద్రయాన్ 3 విజయం తో భారతావనికి చందమామ చేతికందినంత ఆనందం కలిగింది.. భారత అంతరిక్ష పరిశోధన శక్తి ప్రపంచాన్నే అబ్బురపరిచింది …దేశ ప్రజల గుండెల్లో ఆనందం ఉప్పొంగింది..
ఇది భారతీయ శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగంలో ఒక మైలురాయి.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రక ఘట్టం …

చంద్రుడిని ముద్దాడిన విక్రమ్ ల్యాండర్
దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రపుటల్లోకి భారత్
చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ బుధవారం ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్. సరిగ్గా సాయంత్రం గం.6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది..ల్యాండింగ్ ప్రక్రియ సాయంత్రం గం.5.44 నిమిషాలకు ప్రారంభమైంది. రోవర్ చంద్రుడిపై రెండు వారాలపాటు పరిశోధనలు చేయనుంది. మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులపై పరిశోధన చేయనుంది. ప్రధాని మోదీ జోహన్నెస్‌బర్గ్ నుండి

వర్చువల్‌గా చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించారు.

ఇండియా, మీతో పాటు నేనూ నా గమ్యస్థానాన్ని చేరుకున్నానంటూ చంద్రయాన్-3 పేర్కొన్నట్లు ఇస్రో సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది.


ఈ సందర్భంలో శ్రీ శ్రీ రచించిన శరత్ చంద్రిక లోని వాక్యాలు ప్రజలు ,మేధావులు ,కవులు గుర్తుచేసుకోకుండా ఉండలేరు.
… ఆ ఖడ్గ కావ్యం లో శ్రీ శ్రీ చంద్రునితో సామాజిక రాజకీయ అసమానతులపై మాట్లాడుతూనే శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగం లో తనకు గొప్ప వెలుగు కనిపిస్తుంది అంటారు…
“” ఈ భూమికి ఏమంత ఈడొచ్చిందని, సగటు మానవుని వయసు పదకొండు, పన్నెండు..! మబ్బు తునక జేబు రుమాలు మాట చేసుకుని, మా కుర్రాళ్లను చూసి నవ్వకలా జాబిల్లి… ఏమో బహుశా త్వరలో మీ ఇంటికి రావొచ్చేమో..! స్వాగతం పలుకుతావు కదూ… చంద్రమండలానికి ప్రయాణం సాధించలేని స్వప్నం కాదు.. అంటూ కచ్చితంగా చెప్పారు శ్రీశ్రీ …గాలి కన్నా బరువైన వస్తువును నేల మీద పడకుండా నిలబెట్టేముగా.

పరమాణువు గర్భంలోని రహస్యాలు, మహాకాశంలో వాతావరణం మర్మాలు తెలిశాక , సరాసరి నీ దగ్గరకే ఖరారుగా వస్తాములే… అప్పుడు ఆదరిస్తావు కదూ.. ఉత్తర ధ్రువంలో ఒకప్పుడు వ్యవసాయం జరిగి తీరుతుంది ..అంటారు శ్రీశ్రీ… ఉత్తర ధ్రువంలోని వ్యవసాయం జరిగి తీరుతుందని కూడా శ్రీ శ్రీ ఆ కావ్యం లో ఊహించారు… సముద్రంపై నీవు సంతకం చేసేటప్పుడు గాలి చెరిపేయకుండా కాలమే కాపలా కాస్తుందిలే.. అంటూ చందమామ ఏక రక్త బంధువు అంటూ ఆ కావ్యాల్లో శ్రీశ్రీ రాసిన వాక్యాలు కూడా, చందమామను చంద్రయాన్ త్రి ద్వారా అందుకున్న వేళ అనేకమంది గుర్తు చేసుకుంటున్నారు..
.. శాస్త్ర పరిశోధనా రంగంలో భారత్ వెలిగిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పరిశోధనా రంగంలో మన శాస్త్రవేత్తలు సాధించిన ఈ గొప్ప విజయంతో ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడు పై కాలు మోపిన ల్యాండర్ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసి గొప్ప విజయాలు సాధించాలని దేశమంతా కోరుకుంటుంది.
..

About the author

Mohiddin Shaik

Leave a Comment