రాజకీయం

మనసు గెలిచిన మంత్రి అజయ్ ..ఎన్నికల సమరానికి సిద్ధమైన పువ్వాడ ..కామ్రేడ్ లకు రిక్త హస్తం.అప్పుడు గెలిచింది ఏకవీరుడే..

Written by Mohiddin Shaik

ఖమ్మం నుంచి ఎన్నికల బరిలో దిగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సీటు కేటాయిస్తూ ప్రకటన చేశారు… అజయ్ కుమార్ ఎన్నికల శంఖారావం పూరించారు.. కారు పార్టీ తరపున నేను మరి మీ మీ పార్టీల తరఫున ఎవరు వస్తారో రండి అనే విధంగా ఆయన బరిలో అప్పుడే గిరి గీసి నిలబడ్డారు… మరి కాంగ్రెస్ పక్షాన ప్రత్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించుతారా.., లేకపోతే మైనారిటీ నాయకుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్ను రంగంలోకి దించుతారా.. లేదా వేరే నాయకుడినైనా పోటీకి దించుతారా అనేది తేలాల్సి ఉంది… ప్రధాన పార్టీలుగా బి ఆర్ ఎస్ కాంగ్రెస్ మాత్రమే ఖమ్మంలో బలంగా ఉన్నాయి… ఈ రెండు పార్టీల తర్వాత వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి.బిజెపి ఇక్కడ నామ మాత్రమే…
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం ప్రజల మనసును గెలుచుకోవడంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మనసును కూడా గెలుచుకున్నారు. కేటీఆర్ , కెసిఆర్ మన్ననలు పొందుతూ, వారి మెప్పు పొందే స్థాయిలో తనదైన శైలిలో పనిచేస్తున్నారు . ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను బిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో చావు రేవు తేల్చుకోవాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది .

…… గత ఎన్నికల్లో గెలిచింది ఏకవీరుడే….

స్థానిక సంస్థల్లో అధికార బి ఆర్ ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలను ప్రజలు కట్టబెట్టారు . ఆ తరువాత ఆయా పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార బి ఆర్ ఎస్ పార్టీలో చేరడం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి ఆర్ ఎస్ బలమైన పార్టీగా కనిపిస్తోంది . కానీ అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి వచ్చేటప్పటికి ప్రజలు ఎటువంటి తీర్పుని ఇస్తారనేది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముందే ఊహించడం వ్యూహకర్తలకు సైతం కష్టమవుతుందని పలువురి అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కొత్తల్లో జరిగిన తొలి ఎన్నికల్లో కూడా సెంటిమెంటును కాదని ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం నుంచి ఒక్క స్థానం మాత్రమే బి ఆర్ ఎస్ గెలవగలిగింది . ఆ తరువాత ఐదేళ్లపాటు అధికారం చలాయించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు ఇతర అన్ని ఎన్నికల్లోను , బి ఆర్ఎస్ తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ 2018 ఎన్నికల్లో మళ్లీ ఖమ్మం ఒక్క సీటు మాత్రమే దక్కింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో వారు వన్ సైడ్ అన్నట్లుగా దూసుకుపోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుకు భిన్నమైన ఫలితాలు గులాబీ పార్టీ చవిచూసింది . అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల మనస్తత్వాన్ని ముందుగా ఊహించటం కష్టం అనే అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలోని ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది

….. కామ్రేడ్ లను వదిలేసిన వి ఆర్ ఎస్…

వామపక్ష పార్టీలతో అవగాహన పెట్టుకొని మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించిన బి ఆర్ ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే అవగాహనతో వెళుతుందని ఇప్పటివరకు వామపక్ష పార్టీలతో సహా అందరూ భావించారు. కానీ గులాబీ బాస్ వామపక్ష పార్టీలకు ఎక్కడ ఒక సీటు కూడా కేటాయించకుండా మొత్తం స్థానాలను తమ పార్టీ అభ్యర్థులకు కేటాయిస్తూ ప్రకటన చేయడంతో ఆయా పార్టీల మధ్య పొత్తు లేనట్టేనని తేలిపోయింది. దీంతో వామపక్ష పార్టీలు ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేయడమా లేదా కాంగ్రెస్ ఆహ్వానిస్తే కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడమా అనే అంశంపై ఆలోచనలో పడ్డాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క వైరా నియోజకవర్గం నుంచి రాములు నాయక్ తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగులకే కేసీఆర్ మళ్లీ టిక్కెట్లు కేటాయించారు కొత్తగూడెం నుంచి వనమాకు తిరిగి టిక్కెట్ కేటాయించారు. మధిర నుంచి లింగాల కమల్ రాజు, వైరాకు బానోతు మదన్లాల్ , సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట మెచ్చ నాగేశ్వరరావు , భద్రాచలం తెల్లం వెంకట్రావు , పినపాక రేగా కాంతారావు, ఎల్లందు బానోతు హరిప్రియ నాయకు, లకు టికెట్లు కేటాయించారు . పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ , పేర్లను ప్రకటించేశారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment