తెలంగాణ రాజకీయం

వృత్తిదారులను ఆదుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం.ప్రతి నెల నియోజకవర్గంలో 300 మందికి పంపిణి..చెక్కులు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ అజయ్..

Written by Mohiddin Shaik

వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నదని, ఇకపై నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రతి నెలా పంపిణీ చేయనున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్అన్నారు.మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంకాలనిలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

క్యాంపు కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ అధికారి జ్యోతి అధ్వర్యంలో బిసి కుల వృత్తిదారులకు రూ.లక్ష సాయం పథకాన్ని మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, AMC చైర్మన్ దొరేపల్లి శ్వేత, సిటీ లైబ్రరీ చైర్మన్ ఆశ్రీఫ్ ఆయా డివిజన్ ల కార్పొరేటర్ ల చేతుల మీదుగా రూ.లక్ష చెక్కును పంపిణి చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంత అభివృద్ది, పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఎప్పుడైనా చూసారా చెప్పాలన్నారు. ఇప్పటి వరకు పాలించిన అనేక ప్రభుత్వాలు సంక్షేమంలో కేవలం కంటి తుడుపు చర్యలకే పరిమితం అయ్యారని, కానీ BRS ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఅర్

నాయకత్వంలో అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు విరివిగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారని అన్నారు.

కుల వృత్తులకు రుణాలు అందచేసి వారి పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి సహాయ పడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయంను అర్హులకు అందిస్తున్నామని వివరించారు.

నియోజకవర్గానికి 300 చొప్పున ప్రతి నెల ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులైన మొత్తం 14808 మందిని అధికారులు గుర్తించారని వారందరికీ పంపిణి చేస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చే ఈ రుణాలు లబ్ధిదారులు తమ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు.

ప్రతి నెలా ఇదే సమయంలో ఈ రుణాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నరు.

నిరుపేదలకు, సొంత గృహాలు లేని వారి కోసమే ముఖ్యమంత్రి కేసీఅర్

గృహలక్ష్మి పథకం తీసుకొచ్చారని, ఈ పథకం కోసం జిల్లాలో ప్రతి తహసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మి క్రింద 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వాటిని సైతం అర్హులైన దళితులకు అతి త్వరలోనే పంపిణి చేస్తామన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment