ప్రజా వాగ్గేయకారుడు తన జీవితం మొత్తం నిస్వార్థంగా ప్రజాసేవ అంకితం చేసిన గద్దర్ అన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గద్దర్ అన్న సంతాప సభ ఐజేయు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆ సంఘ నగర కమిటీ అధ్యక్షుడు మైస పాపారావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ విభిన్న సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు సైతం ప్రేమించే గొప్ప వ్యక్తి సాంస్కృతిక విప్లవ నిర్మాతగా పేరు తెచ్చుకున్న గద్దర్ అన్న జీవితం గురించి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గద్దర్ అన్న దేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి మలిదశ ఉద్యమాల్లో గొప్ప పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొందరు నాయకులు ముందుకి తీసుకెళ్లి ఉండవచ్చు కానీ తెలంగాణ ప్రజల్లో ప్రధానంగా పల్లె నుంచి పట్నం వరకు అన్ని వర్గాల ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష రగిలించడంలో గద్దర్ అన్న పాట గొప్ప పాత్ర పోషించిందని రామనారాయణ పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన గద్దర్ అన్న సమాజంలోని అసమానతలు దూరం చేసేందుకు ప్రధానంగా ఈ సమాజంలో అణచివేయబడిన దళిత గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన బుర్రకథలు పాటలు ఆటలు ద్వారా పల్లె పల్లె తిరిగి వారిలో చైతన్యాన్ని రగిలించారని ఆయన పేర్కొన్నారు అందుకే ఆయన జీవిత చరిత్రను భావితరాలకు చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల బాధలను ప్రభుత్వానికి చేరవేసేందుకు ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఇతర మాధ్యమాలు గాని అంతగా లేని రోజుల్లోనే గద్దర్ అన్న పాట గొప్ప మీడియా ఆయనే ఒక మాస్ మీడియా అని రామ్ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గద్దర్ అన్నకు ఘన నివాళి అర్పించారు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

కార్యక్రమంలో ఐజేయు ఖమ్మం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,
ఐ జె యు రాష్ట్ర , నాయకులు నర్వనేని వెంకటరావు,
జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు ,
. ఐజేయు రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్ ,
నాయకులు నలజాల వెంకటరావు,
ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ,
ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకం సైదులు ,
సంఘ నాయకులు . నామా పురుషోత్తం , కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్ ,
. కార్యక్రమంలో ఐజె యు నాయకులు యోగి నాటి మాధవరావు, , కె వెంకటేశ్వర్లు, సంతోష్. భరత్
ప్రసంగించగా,
సంతాప సభ సందర్భంగా నాయకులను వేదిక మీదకు ఐజ యు నాయకులు కూరాకుల గోపి వేదిక మీదకు ఆహ్వానించారు .కార్యక్రమంలో అక్రిటేషన్ కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సామినేని మురారి , న గర కమిటీ కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు కోశాధికారి రాయల బసవేశ్వర రావు , ఏలూరు వేణుగోపాల్, మేడి రమేష్, కళ్యాణ్ చక్రవర్తి, గడల నరసింహారావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
