బి ఆర్ ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్న పొంగులేటిని ఓడించి చట్టసభల గేటు తాకకుండా చెయ్యాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేశారా… ఆయన శపధాన్ని రివర్స్ చేయాలని ఎత్తులు వేస్తున్నారా … ఇందుకోసం, పా వులు కదుపుతున్నార అంటున్నారు.. ప్రత్యర్థిని ఓడించేందుకు అన్ని విధాల ప్రయత్నించడం సహజమే…పొంగిలేటి చేసిన శప దాన్ని బి ఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది… జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పొంగులేటి పై రాజకీయంగా యుద్ధమే ప్రకటించారు.. ఏ విధమైన పొరపాట్లు చేసిన పొంగులేటిని ప్రజల ముందు నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి… ఇప్పటికే ఖమ్మంలో ఎన్ఎస్పి కాలువ స్థల ఆక్రమణ వ్యవహారం పొంగిలేటిపై చర్చకు అవకాశం ఇచ్చింది.. నేను కబ్జాకు పాల్పడలేదంటూ పొంగులేటి నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది… ఇక తాజాగా కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం సభకు జనం సరిగా రాకపోవడం పై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది… జనంలో పొంగులేటి కి రోజురోజుకు ఆదరణ తగ్గుతుంది అనే ప్రచారం మొదలైంది…
… పొంగులేటి శపధం కాంగ్రెస్ శపధంగా చూడడం లేదా…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం సభకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాకపోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి చేసిన శఫదాన్ని కాంగ్రెస్ శ్రేణులు అది కాంగ్రెస్ శపథంగా చూడటం లేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ నాయకుడిగా , ఆయన శపథం తమ శబదంగా కాంగ్రెస్ శ్రేణులు మనస్ఫూర్తిగా భావించే విధంగా పొంగిలేటి ప్రసంగాలు ఉండటం లేదనే విమర్శ వినిపిస్తోంది . ఆయన ప్రసంగాలు తాను ఒక్కడినే కెసిఆర్ ను ఓడిస్తానని ధోరణిలో సాగుతున్నాయని కొందరు పేర్కొంటున్నారు .పొంగిలేటి ప్రసంగాలు కాంగ్రెస్ శ్రేణులను ఆకట్టుకునే విధంగా ఉండాలని అలా ఉండటం లేదనే విమర్శ వినిపిస్తోంది.
.. పొంగులేటిని ఓడించేందుకు వద్దిరాజును ఉపయోగిస్తారా..

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు బలమైన బీసీ నేత ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రన్ రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పొంగులేటి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయనపై వద్దిరాజు రవిచంద్రన్ పోటీకి దించాలని గులాబీ బాస్ వ్యూహరచన చేసినట్లు విశ్వసనీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో బీసీ ఓట్లు దాదాపు 42 వేలకు పైగా ఉన్నాయి. అదేవిధంగా రవిచంద్ర వివాద రహితుడే గాక మున్నూరు కాపు సంఘానికి జాతీయ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీసీ వర్గాల ప్రయోజనాల కోసం ఆయన అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఇక ఆర్థికంగా కూడా పొంగులేటికి ధీటుగా నిలబడే సామర్థ్యం కూడా ఉంటుందని అధినేత రవిచంద్రన్ రంగంలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

…. కాంగ్రెస్‌లో వర్గాలు దెబ్బతీస్తాయా…
కొత్తగూడెం నుంచి ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్‌లోని వర్గాల కుమ్ములాటలు ఆయనను దెబ్బతీస్తాయా అనే చర్చ జరుగుతోంది. కొత్తగూడెం నుంచి ఎడవల్లి కృష్ణ రేణుక చౌదరి వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో అక్కడ నుండి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు, వీరు గాక మోతుకూరి ధర్మారావు టికెట్ ఆశిస్తుండగా భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్య ఆశీస్సులతో పోటీ చేసేందుకు నాగ సీతారాములు ప్రయత్నిస్తున్నారు ఇలా కాంగ్రెస్‌లో కొత్తగూడెంలో ఇప్పటికే నాలుగు కాంగ్రెస్ వేర్వేరు కార్యాలయాలు ఉండగా తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో కార్యాలయాన్ని ప్రారంభించారు.
శత్రు పార్టీ పై విజయం సాధించేందుకు చేసిన శపథం నిలబెట్టుకునేందుకు పెద్ద ఎత్తున పొంగులేటి పోరాడాల్సి ఉంటుంది . అదే సందర్భంలో సొంత పార్టీలోని వర్గాలను కూడా సమన్వయం చేసుకోవడం అంత తేలికైన పనేమీ కాదని పరిశీలకులు అంటున్నారు.
ఇది ఇలా ఉంటే వీఆర్ఎస్ తో వామపక్షాలకు ఎన్నికల పొత్తు ఉంటుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది ఒకవేళ పొత్తు కుదిరితే ప్రస్తుతానికి ఉన్న వ్యూహాలు ఎత్తులు అప్పటికి మారిపోయే అవకాశం ఉంది. వి ఆర్ ఎస్ లో కూడా వర్గ విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ జలగం వర్గం వనమా వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా జలగం వెంకటరావు వనమాను అనరుడిగా ప్రకటించే విధంగా చేశారు. ఎన్నికల నాటికి ఈ రెండు వర్గాలను సమన్వయం చేస్తూ వద్దిరాజు రవిచంద్రన్ రంగంలోకి దింపడం ద్వారా పొంగులేటిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆయన శబ్దాన్ని రివర్స్ చేయాలని సీఎం వ్యూహరచన చేసినట్లు సమాచారం. మొత్తం మీద కొత్తగూడెం రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపనున్నాయి.

