గోదావరి వరదలకు పరివాహక ప్రాంతం మునగడం ఎప్పుడూ జరిగేదే.. కానీ ఖమ్మం నగరాన్ని మున్నేరు కమ్మేయడం విశేషం..మున్నేటిపై మూడు బ్రిడ్జిలపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు… మున్నేరు ఉగ్రరూపం దాల్చింది.. మునుపెన్నడూ లేని విధంగా వేలాది ఇండ్లను ముంచేసింది.. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది… రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తూ , కంటిమీద కునుకు లేకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు… ఇటు మున్నేరు , అటు ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ అధికారుల కు మంత్రి అజయ్ కుమార్ దిశా నిర్దేశం చేస్తున్నారు.. మున్నేటిపై ప్రకాష్ నగర్, కాలువొడ్డు, బైపాస్ రోడ్డు పై ఉన్న మూడు బ్రిడ్జిల పైన రాకపోకలను నిలిపివేయడం ఇదే మొదటిసారి.. బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు… మున్నేటికి అనుకొని కొందరు రియల్టర్లు వెంచర్లు వేసి వందలాది ఇండ్లు నిర్మించి విక్రయించగా, మరికొన్ని ప్రాంతాలలో ప్రజలు గృహాలు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకొని ప్రజలు ఆహాకారాలు చేస్తున్న దృశ్యాలు టీవీ ఛానల్ లో చూసిన ప్రజల హృదయాలు బరువెక్కాయి.
కొన్ని ప్రాంతాల్లో వరదలు జల ప్రళయాన్ని తలపిస్తున్నాయి.. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లోకి వరద నీరు చేరింది వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. మరోవైపు భద్రాద్రి వద్ద గోదావరి పొంగిపొర్లుతుండటంతో భద్రాద్రి పట్టణ వాసుల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.. భద్రాద్రిని అనుకొని చతిస్గడ్ ప్రాంతం నుంచి వచ్చే శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ నీరు భద్రాద్రి ఆవల గోదావరిలో కలిసే ప్రాంతం అక్కడే ఉండటం వల్ల గోదావరి నీరు పోటు తన్ని భద్రాద్రి పట్టణంలోకి నీరు ప్రవహిస్తాయని కొందరు పేర్కొంటున్నారు. గోదావరికి పై నుండి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో అధికార యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తమైంది. ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన ముందస్తు చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. మున్నేటి ముప్పు నుంచి ఖమ్మం పట్టణ ప్రజలను అన్ని విధాలుగా తప్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తో పాటు మంత్రి అజయ్ కుమార్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
. ఖమ్మానికి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు…

ఖమ్మం ఖమ్మం నగరానికి మంత్రి అజయ్ కుమార్ ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రప్పించారు . గురువారం సాయంత్రానికే విజయవాడ నుంచి ఖమ్మం చేరుకున్న ఆయా బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఖమ్మంలోని మంచి కంటి నగర్, కరుణగిరి ప్రాంతం, రాజు స్వగృహ ప్రాంతం , ఆర్టీసీ కాలనీ, జలగం నగర్ , బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, ఎఫ్సీఐ గోదాములు ఏరియా తో పాటు మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని అనేక కాలనీలు నీట మునిగాయి. ప్రకాష్ నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి, కాలువ డ్డు ప్రాంతంలోని బ్రిడ్జి తో పాటు బైపాస్ రోడ్ ప్రాంతం నుంచి ఏటి పై నిర్మించిన వంతెన పై నుంచి కూడా అధికారులు రాకపోకలను నిషేధించారు. మున్నేరు కి ఆవల ఈవల ఒడ్డున అనేకమంది పేదలు సమీపంలో ఉండే ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకొని అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వారి వందలాది ఇండ్లు ప్రస్తుత వరదలకు మునిగిపోయాయి. పైనుంచి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది శుక్రవారం మధ్యాహ్నానికి వరద తగ్గే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని వైరా పాలేరు మధ్యతరహా నీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఉన్నాయి. వీటితోపాటు భద్రాద్రి జిల్లాలోని కిన్నెరసాని ,తాళి పేరు ప్రాజెక్టులు కూడా భారీగా వరద వస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలకు వరదల వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

