జాతీయం తెలంగాణ రాజకీయం

ఖమ్మం జన గర్జన..బిఆర్ఎస్ వర్గాల్లో తర్జన భర్జన.. వచ్చిన వారిలో ఎవరి జనం ఎంత.!పొంగిలేటి చేరికతో కాంగ్రెస్కి కొత్త ఊపు..పాదయాత్రతో అగ్ర నేతల సరసన విక్రమార్క

Written by Mohiddin Shaik

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంతమందిని అసెంబ్లీకి పంపుతారు…ఎవరిని గేటు తాకకుండా అడ్డుకుంటారో తెలియదు గాని , జన గర్జన సభ మాత్రం విజయవంతమైంది.. జన గర్జన, సభ కోసం జన సమీకరణకు అధికార పార్టీ అడ్డంకులు కల్పించిందని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.. ఏకంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు కూడా చేశారు.. రేణుక చౌదరి ఖమ్మం నగరంలో పోలీసు బార్కెట్లను నెట్టివేసి హల్చల్ చేశారు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాలను అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చినప్పటికీ జనం మాత్రం భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.
హాజరైన జనం, సంఖ్య పైనే అధికార బిఆర్ఎస్ వర్గాల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
రకరకాలుగా విశ్లేషిస్తున్నారు
……. పొంగిలేటి చెప్పిన 5 లక్షల మంది వచ్చారా….
ఖమ్మంలో జరిగిన పొంగులేటి చేరిక , బట్టి పాదయాత్ర ముగింపు జన గర్జన సభకు ఐదు లక్షలకు తగ్గకుండా జనం హాజరవుతారని ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి , అటు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.
వారు చెప్పినట్టు ఐదు లక్షలు వచ్చినట్లేనా , అంటే వచ్చారని వారు చెబుతుండగా , అధికార పార్టీ వర్గాలకు చెందిన కొందరు మాత్రం అవన్నీ తప్పుడు లెక్కలని తేల్చేస్తున్నారు. వారి లెక్కల ప్రకారం సభకు హాజరైన జనం మహా అయితే 1 లక్ష 75 వేల మంది లోపే నని అంటున్నారు.
సభా స్థలం 40 ఎకరాలు మాత్రమేనని అందులో 5 ఎకరాలు సభా వేదిక తో పాటు ఇతర అవసరాలకు పోను , మిగిలింది 35 ఎకరాలు మాత్రమేనని వారు లెక్క వేస్తున్నారు. అందులో ఎకరానికి 5,000 మంది చొప్పున మొత్తం 1 లక్ష 75 వేల మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఇక వారిలో 4 పక్క జిల్లాల నుంచి కనీసం పదివేల చొప్పున 40 వేల మంది హాజరై ఉంటారని అంచనా వేస్తున్నారు. 40 వేలు ఫోను మిగిలింది ఇక 1 లక్ష 35,000 మంది, మాత్రమే. వారిలో ఖమ్మం జిల్లా నుంచి 80 వేల మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 55,000 మంది ఉండవచ్చునని లెక్క వేస్తున్నారు. వీరిలో 5 లక్షలకు పది తలలు ఎక్కువే వస్తాయని చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఎంతమంది…, సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ఖమ్మం చేరుకున్న భట్టి విక్రమార్క ముగింపు సభను తిలకించేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది, ..ఇక ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీని చూడాలనే ఉత్సాహంతో వచ్చిన సాంప్రదాయ కాంగ్రెస్ అభిమానులు సంఖ్య ఎంత..! అంటూ అధికార పార్టీ వర్గాల్లో కొందరు లెక్కలు వేస్తూ జనగర్జన సభ విజయవంతం పై తర్జనభర్జనలు పడుతున్నారు…
…. మా జనం అడ్డుగోడలు దూకి వచ్చారు….
ఇదిలా ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ వాళ్ళు అధికార పార్టీ అడ్డుగోడలు సృష్టించిన వాటిని దూకి మరి సభకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెబుతున్నారు. వారి వాదన ప్రకారం సభా స్థలం 40 ఎకరాలు కాదు 80 ఎకరాలట అందులో కొంత వేదికతో పాటు ఇతర అవసరాలకు పోయిన 75 ఎకరాల్లో ప్రజలు కూర్చున్నారని వారు లెక్కలు వేస్తున్నారు వారి లెక్కల ప్రకారం 4 లక్షలకు పైగానే జనం హాజరయ్యారు. వారు గాక సభ ప్రాంగణానికి బయట వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారని వారు చెబుతున్నారు. ఇక పక్క జిల్లాల నుంచి జనం హాజరైన విషయంపై వ్యాఖ్యానిస్తూ , బి ఆర్ఎస్ ఆవిర్భావ సభకు కూడా బయటి జిల్లాల నుంచి జనం వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద ఇటు పొంగిలేటి భారీ జన సందోహంతో కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి కొత్త ఊపులిచ్చింది అనడంలో సందేహం లేదు. దాంతోపాటు కోట్లు ఖర్చు చేసి ఆధునిక హంగులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సభ వేదికతో సహా ఏర్పాట్లు అన్ని రాహుల్ గాంధీని సైతం ఆకర్షించాయి. ఇక బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఆయన రాజకీయ జీవితంలో నిలిచిపోయే విధంగా జరిగిందని చెప్పవచ్చు. లక్షలాదిమంది ప్రజలు పార్టీలో అతిరథ మహారధుల మధ్య రాహుల్ గాంధీ బట్టిని గుండెలకు హత్తుకోవడం అభినందనలతో ముంచేత్తుతూ ఘనంగా సన్మానించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. విక్రమార్క పాదయాత్ర పై రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఆయనను ప్రశంసించడం కాంగ్రెస్ భావజాలాన్ని సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళుతూ వారికి కాంగ్రెస్ అండగా ఉందని భరోసా ఇవ్వడం పై ఆయనను అభినందించడం బట్టి విక్రమార్క అభిమానులందరిలోనూ ఆనందాన్ని కలిగించింది. ఈ సభతో పట్టి విక్రమార్క తన అన్న మల్లు అనంత రాములు మాదిరిగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పవచ్చు. ఖమ్మం జనగర్జన వేదికగా రాహుల్ గాంధీ విఆర్ఎస్ ప్రభుత్వం పై చేసిన విమర్శలు తమ ప్రభుత్వం వస్తే ప్రజలకు చేసే మేలు కొత్తగా 4వేల రూపాయలు పింఛను ఇస్తామని చేసిన ప్రకటన రాష్ట్రంలో బిజెపి కథమైందని అంటూ ఇక తెలంగాణలో కాంగ్రెస్కు బిజెపికి వీటింగా వ్యవహరిస్తున్న వీఆర్ఏ పోటీ జరుగుతుందని చేసిన ప్రకటనలు సరికొత్త రాజకీయ చర్చకు తెరలైపోయాయని కొందరు అంటున్నారు. మొత్తం మీద ఖమ్మం రాష్ట్ర రాజకీయాలకే కాక జాతీయ రాజకీయ నేతల దృష్టిని మరో మారు ఆకర్షించింది.

About the author

Mohiddin Shaik

Leave a Comment