ఎర్రజెండా లేకుండా ఏ హక్కు సాధించబడలేదు
కొత్తగూడెం ప్రజా గర్జనలో వక్తలు
చట్ట సభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం తగ్గినందునే దేశంలో రాష్ట్రంలో ఈ దుస్థితి దాపురించిందని ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజాగర్జన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలు జిల్లాల నుంచి నిప్పులు చెరిగే ఎండను సైతం లెక్కచేయకుండా దాదాపు లక్ష మంది కమ్యూనిస్టు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణ వీధులన్నీ ఎర్రజెండాలతో ఇరుపెక్కాయి. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అవసరమని అది తగ్గినందునే ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చ జరగకుండానే కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే పేదలకు అన్యాయం చేసే చట్టాలు రూపొందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి హటావో దేశ్ బచావో అనే నినాదంతో సిపిఐ చేపట్టిన పాదయాత్ర లక్ష్యం దాదాపు నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లో అనేక ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు చేసే వారి శ్రమ దోపిడీకి ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి దళిత బంధు వంటి పథకాలు అసంపూర్ణమైన పథకాలుగా మిగిలిపోతున్నాయని ఆయన అన్నారు. దళిత బంధు విషయంలో కొందరు ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక పోడు రైతుల సమస్య పరిష్కారం కాలేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల కోడు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా 11 లక్షలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్టు చెప్పిన ప్రభుత్వం చివరకు నాలుగు లక్షల పట్టాలు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారని ఈ సమస్య పరిష్కరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. బిజెపిని ఓడించాలంటే కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని నారాయణ పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజలు అమిత్ షా మోడీ,గల్లీ గల్లీలో తిరిగి, లెక్క లేనన్ని మీటింగులు పెట్టి ప్రజలకు చెప్పిన బజరంగబలి పేరు చెప్పి ఓటు వేయాలని ప్రధాని దిగజారి ప్రకటించిన ప్రజలు బిజెపిని సాగనంపారని తగిన బుద్ధి చెప్పారని నారాయణ అన్నారు. అదా నీ అక్రమ కంపెనీలపై జేపీసీ వేయమంటే మోడీ వేయడం లేదని అన్నారు. మోడీ ప్రధాని కవల పిల్లలని నారాయణ ఆరోపించారు.
…… ఓట్ల లెక్కలు చూసి సీట్లు ఇచ్చే విధానం సరికాదు….
బిజెపిని ఓడించే ఉమ్మడి లక్ష్యంతో టిఆర్ఎస్ తో కలిసి పని చేద్దాం అని అనుకున్నామని నారాయణ అన్నారు. కెసిఆర్ సూచన మేరకే ఆహ్వానం మేరకే తాము ఆ పార్టీతో కలిసి పని చేయాలని భావించామని ఆయన అన్నారు కానీ సీట్ల కేటాయింపు విషయాలకు వచ్చినప్పుడు ఓట్ల లెక్కలు తీసి సీట్లు కేటాయించాలనుకునే విధానాన్ని కేసీఆర్ విడనాడాలని ఆయన సూచించారు. ఒక రాజకీయ లక్ష్యంతో కలిసి పనిచేసేటప్పుడు ఆ ప్రాతిపదికగానే సీట్ల కేటాయింపు కాలయాపన లేకుండా చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. తమది ఒక రాజకీయ పార్టీ అని ప్రజా పోరాటాలు చేయడమే పార్టీ లక్ష్యం అని అదే సందర్భంలో ఎన్నికల్లోను పోరాడి చట్టసభలకు రావాలని లక్ష్యం కూడా ఉంటుందని ఆయన అన్నారు.
…. ఎర్రజెండా లేకుండా ఈ హక్కు సాధించబడలేదు.. కూనంనేని, చాడ.
ఎర్ర జెండా పోరాటం లేకుండా ఏ హక్కులు సాధించబడలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు , సిపిఐ జాతీయ సమితి నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. కమ్యూనిస్టు పార్టీ పుట్టి వందేళ్ళయినా ఎర్రటి ఎండని లెక్కచేయకుండా నీటికి లక్ష మంది కార్మికులు కర్షకులు ఎర్రజెండాలతో ప్రజా గర్జనకు హాజరవ్వడాన్ని బట్టి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల నిబద్ధతను అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని చూసి ఆయన ప్రజా పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై సాగే పోరాటంలో కమ్యూనిస్టు కార్యకర్తలు అంతా జగన్నాథ రథచక్రాలై సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ కమ్యూనిస్టులతో ఏ అంశంలోనూ సాటి రాలేడని ఆయన పేర్కొన్నారు డబ్బులు అధికారంతో రాజకీయం చేసే బండి సంజయ్ నీ అడ్రస్ ఎక్కడో చూసుకో అంటూ ఆయన సవాలు విసిరారు. ప్రజా గర్జనకు వచ్చిన కమ్యూనిస్టు సైన్యం ఎవరి ఖర్చులతో వారే ఎవరి భోజనాలు వారే చూసుకొని కమ్యూనిస్టు పార్టీ పిలుపునందుకొని వచ్చిన నిజమైన సైనికులేని ఆయన కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ ఎక్కడుంది అని ఏసీ గదుల్లో ఉండి వ్యాఖ్యానించేవారు ఇక్కడికి హాజరైన కార్యకర్తలను చూసి కళ్ళు తెరవాలని ఆయన పేర్కొన్నారు. బిజెపికి మూల సిద్ధాంతంలో మూడు రకాల శత్రువులు ఉన్నారని కానీ కమ్యూనిస్టు పార్టీకి మొదటి శత్రువు చివరి శత్రువు కూడా బిజెపి నేనని ఆయన పునరుద్ఘాటించారు. కెసిఆర్ తెలంగాణ సాధనలో సిపిఐ పాత్ర అమోఘమైందని అనేక సందర్భాల్లో చెప్పారని ఢిల్లీలో సైతం డి రాజా ప్రత్యేక రాష్ట్ర సాధన విషయంలో ఏవి వర్ధన్ గారి వద్దకు తీసుకెళ్లి మాట్లాడించేవారని పదేపదే చెబుతున్న కేసిఆర్ కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయాలని అనుకున్న కేసీఆర్ ఉమ్మడి పోరాటంపై కే స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
