ఈనెల 15న అమిత్ షా, 25న రాహుల్ గాంధీ సభలు.
ఖమ్మం పై పట్టు బిగించిన మంత్రి అజయ్.
జాతీయ ప్రధాన పార్టీల నాయకులు ఖమ్మం బాట పట్టారు.. ఈనెల 15న బిజెపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో బహిరంగ సభకు హాజరవుతుండగా , 25న కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. .. బిజెపి అగ్ర నేత అమిత్ షా నైరాస్యంలో ఉన్న బిజెపి కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు వస్తుండగా, కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వస్తున్నారు… టిఆర్ఎస్ వీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత తొలి జాతీయ మహాసభను ఖమ్మం కేంద్రంలోని లక్షలాది మందితో నిర్వహించిన విషయం తెలిసింది కేసీఆర్ తన జాతీయ పార్టీ విధానాలను స్థూలంగా ఖమ్మం వేదిక నుంచే ప్రకటించిన సంగతి తెలిసిందే . ..పొంగులేటి , జూపల్లి కృష్ణారావు తదితరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు, వారు కూడా ఖమ్మం బహిరంగ సభలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను ప్రభావితం చేసే విధంగా రాహుల్ పలు హామీలను ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో పెద్ద సంఖ్యలో బిజెపిలో చేరుతారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆయనను చేర్చుకునేందుకు అమిత్షా స్థాయిలో బిజెపి చేరికల కమిటీ ఆధ్వర్యంలో మంతనాలు పలు దాఫాలు జరిగిన విషయం కూడా తెలిసింది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లినందున బిజెపి శ్రేణుల్లో ఒకంత నైరాస్యం ఏర్పడిందనే భావనలో బిజెపి నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొంగులేటి బిజెపి లో చేరకుండా ఆగిపోవడానికి కారణాలను ఆ పార్టీ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు . బిజెపిలో పొంగులేటి చేరితే ఆయనతో తన అనుచర వర్గంలో మెజారిటీ వర్గం వచ్చేందుకు నిరాకరించిన సందర్భాలు ఇక్కడి బిజెపి నేతలు చూశారు. బిజెపి సిద్ధాంతాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో ఉన్న మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు. ఫలితంగానే ఆయన కాంగ్రెస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపి శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతోనే ఖమ్మంలో అమిత్ షా తో ఆ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇక పొంగులేటి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుండగా ఇప్పటివరకు ఆ పార్టీని నమ్ముకొని పనిచేసిన ఆశావహుల్లో మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది.
.. . ఖమ్మం పై పట్టు బిగించిన మంత్రి అజయ్ కుమార్…
ఖమ్మం పై బిజెపి కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టి మంత్రిని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాతో పాటు ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ముద్రను వేసుకున్నారు ఒక విధంగా పట్టు కలిగి ఉన్నారని. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో నిరంతరం ప్రజలతో మమేకమై ఉండటంతో పాటు ఖమ్మం నగర అభివృద్ధికి సుందరీ కరణ చేయడంలో ఆయన శక్తి వంచన లేకుండా పని చేశారని పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల నాటికి రాజకీయ పార్టీల మధ్య పొత్తులు వ్యూహాలు ఎలా మారినప్పటికీ మంత్రి అజయ్ కుమార్ గెలుపుకు డోకా లేదని ఆ పార్టీలోని సీనియర్లు పేర్కొంటున్నారు.
…. ఖమ్మం ఓటరు నాడి అంతు చిక్కటం కష్టం…
కమ్యూనిస్టు పోరాటాల గడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల నాడిని ఓ పట్టణ కనిపెట్టడం చాలా కష్టమని పరిశీలకులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాటి టిఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని వాతావరణం ఎన్నికల సభల్లో కనిపించినప్పటికీ ఫలితాలు వచ్చేసరికి ఒక్క ఖమ్మం అసెంబ్లీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే కారు గుర్తుపై గెలవగలిగారు. ఈ ఫలితం రాజకీయ పండితుడిగా యోహకర్తగా పేరున కేసీఆర్ను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య విభేదాల వల్లనే అంత దారుణమైన ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఆ తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ కు నాయకత్వం అప్పజెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఆ తర్వాత జిల్లా పరిషత్తు గ్రామపంచాయతీలు సహకార సంఘాలు మున్సిపల్ కార్పొరేషన్ ఇలా అన్ని ఎన్నికల్లోను టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించే విధంగా కృషి జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఒక్క భట్టి విక్రమార్క పోదాం వీరయ్య మినహా అందరిని టిఆర్ఎస్ లో చేర్చుకొని కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాని గులాబీ పార్టీ గుమ్మంగా మార్చారు. ఈ అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రత్యేక దృష్టితో చూస్తారనడంలో సందేహం లేదు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఏ విధమైన వ్యూహాలను అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది కమ్యూనిస్టులతో ఎన్నికల పొత్తు ఉంటుందని చెబుతున్నప్పటికీ పొత్తుల విషయంలో ఇప్పటివరకు తేల్చడం తేల్చకుండా నాన్చుడి ధోరణి కెసిఆర్ అవలంబిస్తున్నారని కొందరు అంటున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు ఉండి ముందస్తుగా దానిపై స్పష్టత వచ్చినట్లయితే ఈ జిల్లాలో ఎన్నికల పోరు అత్యంత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అటు కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకు ఉంది ఇటు కమ్యూనిస్టులతో కలిపి బీఆర్ఎస్ కూడా బలమైన శక్తిగా రంగంలో ఉంటుంది బిజెపి కూడా రంగంలో ఉండే నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలుంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు పొసగాక పోయి వారు సైతం కాంగ్రెస్ వైపు అడుగులేస్తే ఉమ్మడి జిల్లా తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు హోరాహోరీ గానే ఉంటాయని కూడా కొందరు అంటున్నారు. ప్రభావితం చేసే కీలకమైన నిర్ణయాలు ఖమ్మం వేదికగానే జరుగుతాయనే ప్రచారం కూడా జరుగుతుంది.
ప్రస్తుతం జాతీయ నేతలు బహిరంగ సభల సందడితో ఖమ్మం రాజకీయంగా వేడెక్కనుంది.
