ఆ ప్రమాదానికి ఉలిక్కిపడిన దేశం.
ప్రళయం రెప్పపాటు లోనే సంభవిస్తుందని ఆధ్యాత్మిక ధర్మ గ్రంథాలన్నీ చెబుతాయి… సరిగ్గా కోరమండల్ రైలు ప్రమాదం కూడా రెప్పపాటు లోనే జరిగింది.. సుమారు 300 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి… 1000 మందికి పైగా తమ అవయవాలను కోల్పోయారు… నిద్రలో ఉన్న వారు కొందరు మేలుకొని ఈ లోకాన్ని చూడనే లేదు… గాఢ నిద్ర నుంచి మృత్యువు ఒడిలోకి చేరిపోయారు.. ఘోర ప్రమాద వార్త విని భారత దేశమే ఉలిక్కిపడిందంటే అతిశయోక్తి కాదు… దేశ దేశ ప్రధాని దిగ్భ్రాంతి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు… ప్రధాని మోదీ తో సహా పలువురు ముఖ్యమంత్రి ఘటన స్థలానికి చేరుకొని శవాల గుట్టలను క్షతగాత్రుల ఆర్తనాధాలను విని చూసి చలించిపోయారు. యుద్ధం జరిగాక మరు భూమిలో ఉండే వాతావరణాన్ని చూశారు. సైనిక హెలికాప్టర్లు వందలాది అంబులెన్స్‌ల సైరన్ మూతలు ఎటు చూసినా ఆహాకారాలు రణభూమిలా రైలు ప్రమాద స్థలం కనిపించింది. హృదయ విధారక దృశ్యాలు వివిధ టీవీ ఛానల్ లో ఊపిరి బిగబట్టి కోట్లాదిమంది జనం చూశారు. తమ వారిని ఇందులో కోల్పోయిన వారి ఆక్రందనలు అనంత లోకాలకు వినిపించేలా ఉన్నాయి. ఏ తీవ్రమైన భూకంపము అతిపెద్ద పెను తుఫాను సంభవించినప్పుడు జరిగిన నష్టం కంటే కోరమండల్ రైలు ప్రమాదం వల్ల అధిక నష్టం జరిగింది. ప్రమాదం ఒరిస్సా లోని బాలాసోర్ కి 40 కిలోమీటర్ల దూరంలో జూన్ రెండున అర్ధరాత్రి జరిగింది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమండల్ సూపర్ ఫాస్ట్ రైలు లూప్ లైన్ లోకి వచ్చి ఢీ కొట్టింది. ఇది సిగ్నలింగ్ వైఫల్యం వల్లే జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన రైలు ప్రమాదాల్లో ఇది అతి పెద్ద మూడో ప్రమాదంగా చెబుతున్నారు.
….. ఇంటికి వస్తారు అనుకుంటే కాటికి వెళ్లారు…
ఎక్కడో దూరంగా ఉండే తమ వారు ఇక ఇంటికి వస్తారని అక్కడ రైలు ఎక్కి ఇంటికి వస్తున్నామని ఫోన్లో చెప్పినవారు దాదాపు 300 మంది తమ ఇంటికి రాలేదు.
వారంతా కనిపించని లోకాలకు వెళ్లారు అనే వార్త వచ్చింది.. ఆ వార్తలు విని గుండెలవిశేలా రోదించే వారి వారి బంధువులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఇక అదే రైల్లో ప్రయాణిస్తున్న వారి బంధువులు వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వివిధ రైల్వే స్టేషన్లలో , హెల్ప్ లైన్ వద్ద పడుతున్న ఆత్రుత , ఆవేదన చూసిన వారికి సైతం గుండెలు బరువెక్కాయి.
……, ఆ యువకులు మానవతామూర్తులు….
రైలు ప్రమాదంలో బాధితుల కోసం రక్తదానం చేసేందుకు వందల ఆదిమంది యువకులు అర్ధరాత్రి అక్కడ స్వచ్ఛందంగా క్యూ కట్టారు. నిజంగా వారంతా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వచ్చిన ప్రాణదాతలు. అచ్చమైన మానవత మూర్తులు. స్వార్థం లేని సేవకులు. మానవత్వానికి, ప్రేమకు మతం , ప్రాంతం, కులంతో పనిలేదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవతా మూర్తులు చేస్తారు . ఇటువంటి ఘటనలు జరిగిన ప్రతి సందర్భంలోనూ వారి సేవ లు అందిస్తుంటారు ఇదే భారత జాతి గొప్పతనానికి నిదర్శనం అని చెప్పవచ్చు. క్షతగాత్రుల , మృతుల కుటుంబాలకు ధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుందాం.
