బిజెపిని షేక్ చేస్తున్న ఈటెల కామెంట్స్;
తాజాగా ఈటెల చేసిన కామెంట్స్ రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి …పొంగులేటి జూపల్లి తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారని ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర బిజెపి అగ్ర నాయకులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.. ఈటెల పొంగులేటి రహస్య సమావేశంపై ఐకాన్ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనంలో ముందే చెప్పింది. ,,పొంగులేటిని లాక్కుంటారా ,ఈటెల, ఇటు వైపుకు వస్తారా.,, అనే శీర్షికతో ,మే 26న ఐకాన్ తెలుగు న్యూస్ లో ప్రత్యేక కథనం వెలువడిన విషయం తెలిసిందే, . ఆ కథనంలో హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో వారి రహస్య సమావేశం వ్యూహాత్మకంగానే లీక్ అయిందని కూడా ఐకాన్ న్యూస్ పేర్కొంది. ఆ సమావేశంలో బిజెపిలోకి రావాలని ఈటెల చెబుతుండగా అది కాదు మీతో సహా బిజెపిలోని అసంతృప్తి నేతలు అంతా మాతో కలిసి రండి అందరం కలిసి బి ఆర్ఎస్ ను ఓడిద్దామంటూ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు ఈటెలకే రివర్స్లో కౌన్సిలింగ్ ఇచ్చారనే విషయాన్ని ఆ కథనంలో విలువడింది. కాగా తాజాగా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రత్యేక కథనానికి బలాన్ని చేకూర్చుతున్నాయి.
…. బలహీనపడ్డ డబల్ ఇంజన్ నినాదం…
ఈటెల వ్యాఖ్యలతో సహా రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూసినప్పుడు బిజెపి అగ్రనేతలు పదేపదే బలంగా వినిపించే డబల్ ఇంజన్ సర్కారు నినాదం బలహీన పడిపోయినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా పొంగిలేటి వర్గానికి సంబంధించి బిజెపిలో ఎందుకు చేర్చుకోలేకపోయారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు చేరికలు కమిటీ చైర్మన్ రాజేందర్ స్పష్టంగా చెప్పిన విషయాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా బిజెపిలో చర్చనీ అంశాలుగా మారాయి. పొంగులేటి జూపల్లితో సహా ఆయా నేతలను ఇప్పటివరకు ఆపగలిగాను గాని ఆయా నేతలు బిజెపిలో చేరడం సాధ్యం కాదని ఈటెల చెబుతున్నారు. అంతటితో ఆగకుండా పొంగిలేంటి లాంటి నాయకులు కచ్చితంగా, బి ఆర్ ఎస్ ను ఓడించగల పార్టీ ఏదో స్పష్టంగా తెలుసుకొని ఆ పార్టీలో చేరతారని బిజెపి బి ఆర్ఎస్ ను ఓడించ జాలదని వారు నమ్ముతున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా బిజెపి వర్గాల్లో ఇప్పటిదాకా తమ అగ్రనేతలు చెప్పినట్లు డబల్ ఇంజన్ సర్కార్ కచ్చితంగా వస్తుందని అనుకునే క్యాడర్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదే సందర్భంలో ఈటెల మాటలు వాస్తవాలను తెలియజేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి , కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లు వివిధ సందర్భాలలో లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఏర్పడుతుందని , ఈ ఆరోపణ కాంగ్రెస్ పదేపదే చేస్తున్న విషయాన్ని ప్రజలు నిజమే అనుకుంటున్నా రని కూడా వ్యాఖ్యానించడం , బిజెపి అగ్ర నాయకులను కలవర పెడుతున్న అంశంగా కొందరు పేర్కొంటున్నారు. అగ్ర నాయకత్వాన్ని ఇరుకునుపెట్టే విషయాలను బహిరంగంగా ఆ పార్టీలోని నేతలు ఈ రకంగా వ్యాఖ్యానించడం, వారు సైతం బిజెపిని వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారనే ప్రచారానికి బలాన్ని ఇస్తోందని కొందరంటున్నారు. అలాంటి సంకేతాలు రాజకీయ వర్గాల్లోకి వెళతాయని కూడా బిజెపి నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అటు బిజెపిలో చేరడం లేదని విషయం తేట తెల్లం అయింది. కాగా పొంగిలేటి సైతం రివర్స్ కౌన్సిలింగ్ చేసిన బిజెపిలోని అసంతృప్తి నాయకులు బిజెపిని వీడి బయటికి వస్తారా , లేదా, అనే విషయం తేలాల్సి ఉంది.
