బి ఆర్ ఎస్ వ్యూహం ఫలించిందా…?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్విత మిత్రులు, ఉండరంటారు .. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అందునా పొంగులేటి వర్గంలో అది కండ్ల ముందు కనబడుతోంది… బి ఆర్ ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు డాక్టర్ మట్టా దయానంద్ కాంగ్రెస్‌లు చేరికపై సర్వత్ర చర్చ జరుగుతుంది . సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న దయానంద్ దంపతులు తొలుత పొంగులేటి తో ప్రయాణం తాత్కాలికంగా ఆపి, ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు ఇలా చేయమని ఎవరైనా వ్యూహ కర్తలు సలహా ఇచ్చా రా , లేక ఆయనే అడుగు వేశారా ,తెలియదు గాని ఇది కచ్చితంగా యుహాత్మక అడుగేనని కొందరు అంటున్నారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న దయానందును పొంగులేటి నుంచి దూరంగా జరిగేలా బి ఆర్ఎస్ నేతలే మొదట వ్యూహం పన్నారనే ప్రచారం జరిగింది . అది ఎలా అంటే పొంగులేటి బిజెపి వైపు అడుగు వేస్తారనే ప్రచారాన్ని చూపి క్రిస్టియన్ మైనారిటీ వర్గాల్లో బలమున్న తాను పొంగులేటితో ఉంటే ఇబ్బంది పడతాడని సూచించినట్లు ప్రచారం జరిగింది. అదే సందర్భంలో పొంగులేటి వెంట వెళ్లకుండా ఉంటే , బిఆర్ఎస్ లోనే సముచిత స్థానం లభిస్తుందని కూడా హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే దయానంద్ బిజెపి చేరికల ప్రచారంతో పొంగులేటికి దూరంగా జరిగారు . బిజెపి వైపు వెళితే తాను పొంగులేటితో రాజకీయంగా కలిసి నడవడం వీలుకాదని కూడా చెప్పేశారు. టిఆర్ఎస్ నేతలు పొంగిలేంటి వెంట ఉన్న బలమైన అనుచరులను నిలువరించే ప్రయత్నాల్లో భాగంగానే దయానందును ఆపగలిగారనే చర్చ జరిగింది. కాగా పొంగిలేటితో దూరంగా ఉన్నప్పటికీ దయానంద్ కొంతకాలంగా తటస్థంగా ఉన్నారు .పొంగులేటి కాంగ్రెస్ వైపు అడుగు వేస్తే ఆయనతోటే కలిసి నడవాలని ఎదురు చూశారు. త్వరలోనే పొంగులేటి కాంగ్రెస్ లో చేరతారనే ప్రకటన వస్తుందని ఎదురుచూసారు . కానీ హఠాత్తుగా సత్తుపల్లి కి చెందిన పి.ఆర్ ఈ ఈ సుధాకర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పొంగిలేటి ప్యానల్ లో సత్తుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే అనధికార ప్రకటన వచ్చింది. ఈ పరిణామాలను గమనించిన దయానంద్ ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ని కలుసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్యారని కొందరు అంటున్నారు. అంటే పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళతారు అప్పుడు తాను కూడా వెళ్లాలని ఎదురు చూస్తే , ఒకవేళ వెళ్ళినా సీటు తనకు కాకుండా సుధాకర్ కు పొంగిలేటి కేటాయిస్తారని అభిప్రాయం దయానందులో కలిగినట్లు కొందరు చెబుతున్నారు. అందుకే ఆయనే ముందస్తుగా వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . రేవంత్ తో హామీ తీసుకుని సత్తుపల్లిలో ప్రజలు తనను ఆదరిస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తనను ఆశీర్వదించే అవకాశాలే ఉన్నాయని ఆయన ప్రకటించుకున్నారు. ఒక విధంగా దయానంద్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌లో ముందస్తుగా చేరారు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొంగులేటి కూడా కాంగ్రెస్‌లో చేరితే దయానందుకు టికెట్ ఇప్పించి గెలిపిస్తారా , లేక ఆయన హామీ తోనే ఉద్యోగానికి రాజీనామా చేసిన సుధాకర్ కు టికెట్ ఇప్పించి గెలిపించే ప్రయత్నం చేస్తారా, ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకోవాలో పొంగులేటి తేల్చుకోవాల్సింది ఉంది. వచ్చే ఎన్నికల్లో దయానంద్ పొంగిలేటికి మిత్రుడు గానే ఉంటాడా రాజకీయ శత్రువుగా భావిస్తారా వేచి చూడాల్సి ఉంది.
