తెలంగాణ

అయ్యో పాపం… ఏ తల్లి కన్నదో…!
కానీ పారేసిన ఆ కఠినాత్మురాలు ఎవరో….?

Written by Mohiddin Shaik

జన్మించిన శిశువు తన తల్లి వెచ్చని పొత్తిళ్లలో హాయిగా పడుకుంటుంది… కానీ తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువు కుక్కలకు ఆహారంగా మారబోయింది…. వివరాలు ఎలా ఉన్నాయి..

మురుగు కాల్వ పక్కన పొదల్లోంచి మృత శిశువును కుక్కలు లాక్కొచ్చాయి… ఆ బిడ్డ భూమి మీద పడి ఇంకా కళ్ళు తెరవక ముందే ప్రాణాలు తీసినట్లు కనిపిస్తోంది… ఆ శిశువుకు బొడ్డు కూడా కోయలేదు ఆ పసిగుడ్డు శవాన్ని కుక్కలు లాగుతున్న దృశ్యాన్ని చూసిన వారు అయ్యో పాపం ఏ తల్లి కన్నా బిడ్డ. . ఆ తల్లికి ఇంత చక్కటి బంగారు బిడ్డను పారేయడానికి మనసెలా ఒప్పిందో అంటూ ఆవేదన చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు , అనాధల ఆత్మబంధువు అన్నం శ్రీనివాసరావుకు కబురు పెట్టారు. అన్నం శ్రీనివాసరావు బృందం వచ్చి అక్కడి నుంచి శిశువు మృతదేహాన్ని తరలించారు. తెలిసో తెలియకో తప్పు చేసి కన్న బిడ్డను కర్కశంగా పారేసిన ఆ తల్లి ఈ సంఘటనను మరచిపోగలదా. .? తన జీవితంలో ఇలా జరగడం పాపము, ..శాపము, ఏదో ఒకటి జీవితాంతం తాను మానసికంగా శిక్ష అనుభవించకుండా తప్పించుకోగలుగుతుందా. .! నైతిక విలువలు పక్కనపెట్టి కట్టుబాట్లు పట్టు తప్పినప్పుడు జరుగుతున్న అనర్ధాలు , ఇటువంటి హృదయ విధారక ఘటనలకు పునాదులు అవుతున్నాయి. నేటి యువతలో కొందరు విలువలను వదిలేయడమే కాదు , మానవ జన్మ విలువను కూడా అర్థం చేసుకోలేకపోవడం ఈ సమాజానికి శాపంగా మారిందని విజ్ఞులు అంటున్నారు . ఇలాంటివి చూసినప్పుడైనా ఇకపై ఇలాంటి ఘటనలకు తావు లేకుండా నైతిక విలువలు పెంపొందించేలా ప్రయత్నించాలని మెరుగైన సమాజం వైపు అడుగులు వేయాలని పెద్దలు, ఆధ్యాత్మిక చింతనాపరులు సూచిస్తున్నారు.
…….. …….
మొహిద్దిన్

About the author

Mohiddin Shaik

Leave a Comment