పామాయిల్ పరిశ్రమ పనులు వెంటనే మొదలు పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోద్రెజ్ కంపెనీ అధికారులను ఆదేశించారు.బుధవారం ఖమ్మం లోని తన క్యాంపు కార్యాలయంలో కొనిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిర్మించనున్న ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కి సంబంధించి గోద్రెజ్ కంపెనీ , ఆయిల్ ఫెడ్ అధికారులతో సమీక్షించారు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని గోద్రెజ్ కంపెనీ వారు ఇక్కడ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం పై రైతుల్లో చైతన్యం నింపుతున్నట్లు ,అందుకు అనుగుణంగా పామ్ ఆయిల్ తోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. గోద్రెజ్ కంపెనీ ప్రభుత్వానికి ఇచ్చిన హామీ ప్రకారం వేగంగా ఫ్యాక్టరీని పూర్తి చేయాలని ఆయన సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా ఫామ్ ఆయిల్ సాగులోకి రానుందని ఆయన పేర్కొన్నారు.
ప్రైవేట్ రంగంలో కూడా పామాయిల్ పర్సనల్ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు .
అంజనాపురంలో పామాయిల్ పరిశ్రమ, సీడ్ గార్డెన్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు .పరిశ్రమ మ్యాప్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో గోద్రెజ్ ,ఆయిల్ ఫెడ్ అధికారులు సౌగత్ అయోగ్ చావా వెంకటేశ్వరరావు ,పామాయిల్ రైతు నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు ,తాతా రఘునాథ్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు రావూరి సైదుబాబు ,తదితరులు పాల్గొన్నారు
