తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంటే కల్వకుంట్ల కవితమ్మే గుర్తుకొస్తారు… ఆ పండుగ కొన్ని తరాలుగా సాగుతున్నదే కావచ్చు, కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జాగృతి సాంస్కృతిక సంస్థ ద్వారా కల్వకుంట్ల కవితమ్మ బతుకమ్మను జాతీయ ,అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు అనడంలో సందేహం లేదు.. కానీ ఆమె ఈ సంవత్సరం జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె మార్కు గానీ, జాగృతి సంస్థ జోరు కానీ ఎక్కడ కనిపించలేదు . టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాగృతి సంస్థ కూడా ఒక ప్రభుత్వ సంస్థ మాదిరిగా ఎంతో పటిష్టంగా పనిచేసేది .

రాష్ట్రవ్యాప్తంగా జాగృతి సాంస్కృతిక సంస్థకు విభాగాలు ,పటిష్టమైన కమిటీలు ఉన్నాయి. వాటి ద్వారా బతకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే స్థాయిలో నిర్వహించేవారు .. టిఆర్ఎస్కు అధికారం పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాగృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్త్రీలకు 30 శాతం రిజర్వేషన్ కావాలంటూ ఢిల్లీలో సైతం కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించారు. కానీ జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత జాగృతి సాంస్కృతిక సంస్థను మళ్లీ ఉత్తేజపరిచి బతుకమ్మ ఎప్పటిలాగే పాల్గొనలేదని, ఆ సంస్థ పేరే ఈసారి పెద్దగా వినిపించలేదని బతుకమ్మ సంబరాలు అయిపోయిన తరువాత కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది.
సాంస్కృతిక కార్యక్రమము అయినా సాంప్రదాయ బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొనకుండా ఉండాలని కోర్టు నుంచి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా, లేకపోతే ఆమెకు బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ పట్ల ఉత్సాహం తగ్గిందా అనే చర్చ సర్వత్ర వినిపిస్తోంది. లిక్కర్ కేసులో ఆమె దోషిగా నిరూపింప పడలేదు అయినప్పటికీ కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన ఆమె వేలుపై వచ్చాక జాగృతి సంస్థను మరింత జాగృతం చేసి జనంలోకి వస్తే బాగుండేదని అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
