నా దారిక అడ్డు నిలిచి నాపై నింద లేల..!
ప్రకృతి ఆదేశంతో పరుగులు తీస్తాను నేను..
నా శక్తికి కొలమానం ఏమీ లేదు.
చల్లని పవనవేచికల స్పర్శతో పరవశించి కురుస్తాను
చినుకునై , వాగునై ,ఏరునై ,నది నై, మహా వరద నై పరవళ్ళు తొక్కుతాను.
నా దారులన్నీ ఆదికాలం నాడే ఏర్పడ్డాయి..
నా దారులకు అడ్డుగా నిలవడం ఆక్రమించడం ప్రకృతి విరుద్ధమని మీకు తెలియదా..!
వరుణాజ్ఞతో కుండపోతగా కురిసి శర వేగంతో పరుగులు తీస్తూ నా తల్లి కడలి ఓడిని చేరతానని మీకు తెలియదా..!
అలా నేను పరుగు తీసే క్రమంలో అడ్డుగా నిలిచే దేన్నైనా నిర్దాక్షిణ్యంగా ముంచేస్తాను..
నీరు పల్ల మెరుగని మూర్ఖులకు కూడా తెలిసేలా జ్ఞానులు ఏనాడో చెప్పారు..
ఆ మాత్రం తెలివి లేనివారా మీరు..? నిబంధనలకు నీళ్లు వదిలి మనుషులను మోసం చేయవచ్చు..
ప్రళయ ఘోషను తలపిస్తూ నలువైపులా వరదనై నేను ముంచితేటప్పుడు ఎవరు రక్షిస్తారు.. !
నేను వరద నై పల్లానికేగా పరుగు తీస్తున్నాను… ప్రకృతి విరుద్ధంగా మేరకలెక్కి ముంచుతున్నానా..!
మరి నా మీద నిందలు ఎందుకు వేస్తున్నారు.. వరదలు వచ్చి మమ్ముల ముంచేసేయ్ అంటూ ఎందుకు నిందిస్తున్నారు..!
చిన్న నాలా నుంచి మొదలు, చెరువులు ,ఏరులు నా నిలయాలుగా ఉండే ప్రతి ప్రదేశాన్ని ఆక్రమిస్తున్నారు.
ఎప్పటికైనా నా ఆగ్రహానికి గురవుతారని మీకు తెలియదా..!
మనుషులుగా మీరు చేసే తప్పులకు ప్రకృతి ఎన్నటికీ బాధ్యత వహించదు..
రచన
మొహిద్దిన్
9441087659.
