పాయింట్ పైకి మలచి, బూట్లు చేతిలో పట్టుకొని…పొలం గట్టుపై జిల్లా కలెక్టర్ నడచి రావడాని చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు… పొలం వద్దకు వచ్చిన కలెక్టర్ రైతులను పిలిచి వారితో కలిసి నేలపైనే కూర్చొని వారితో ముచ్చటించటం కూడా రైతుల్లో మరింత ఆనందాన్ని నింపింది…

ఇటీవల నూతనంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ముజంమిల్ ఖాన్ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.. గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్గా పని చేసిన ఉషారాణి నిత్యం క్షేత్ర పర్యటనలు చేస్తూ పాలనలో తన దైన ముద్ర వేసుకున్నారు… ఇప్పుడు మళ్లీ కొత్తగా వచ్చిన యువ కలెక్టర్ క్షేత్ర పర్యటనలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు కనిపిస్తోంది.. అదే సందర్భంలో తాను ఎక్కడికి వెళ్లినా నవ్వుతూ మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుని వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
….. పొలాల్లో రైతులతో ముచ్చటించిన కలెక్టర్…
వ్యవసాయ శాఖ జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శుక్రవారం తల్లాడ మండలంలోని పొలాల్లో పర్యటించారు… రైతులతో కలిసి కింద నేలపైనే కూర్చుని రైతుల్లో రైతు మాదిరిగా వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భూమి పట్టాలకు సంబంధించి సమస్యలపై కూడా ఆయన రైతులకు పరిష్కారం మార్గాలు చూపించారు. సమస్యల పరిష్కారానికి దరఖాస్తు ఎలా చేయాలి? ఎవరి ద్వారా చేయాలి వంటి అంశాలను కూడా రైతులకు నేరుగా చెప్పారు..
ఖరీఫ్ లో వేసే పంటల వివరాలు పండ్ల తోటలు పామాయిల్ వంటి తోటలు పెంపకం తదితర అంశాలపై కూడా రైతులతో సరదాగా నవ్వుతూ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ రైతుల పంటలకు సంబంధించి నారు పోసిన నాటి నుంచి పంట చేతికి వచ్చేవరకు వారికి సరైన సలహాలు సూచనలు ఇస్తూ అధిక దిగుబడులు వచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు… తాము పని చేస్తున్న పొలాల వద్దకు ప్యాంటు పైకి మలుచుకొని బూట్లు చేతిలో పట్టుకొని పొలం గట్లపై నడుచుకుంటూ కలెక్టర్ రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అయింది..

….. గ్రంథాలయంలో విద్యార్థులతో మాట్లాడిన ముజమిల్ ఖాన్..
ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో కలెక్టర్ కొద్దిసేపు ముచ్చటించారు. గ్రంథాలయంలో వారికి లభిస్తున్న సౌకర్యాలపై ఆయన పరిశీలనకు వచ్చిన సందర్భంగా విద్యార్థులతో పాటే బల్లపై కూర్చొని గ్రంథాలయంలో మెటీరియల్ లభ్యత ఎలా ఉంది? ఆన్లైన్ ద్వారా కూడా పోటీ పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావచ్చు విద్యార్థులకు వివరించారు.. పాత భవనాలు కూల్చివేసిన ప్రదేశంలో కొత్త భవనాల నిర్మాణం పై కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఇలా క్షేత్ర స్థాయి పరిశీలనల, పర్యటనలతో కలెక్టర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు…
గతంలో ఉషారాణి కలెక్టర్ వేసవిలో మండుటెండల్లో బొగ్గు గనుల్లోకి తాను స్వయంగా వెళ్లి అక్కడ ఉష్ణోగ్రతలను తెలుసుకొని గని కార్మికులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అది ఒక ఉదాహరణ మాత్రమే అలాంటి అనేక విషయాల్లో ఆమె క్షేత్రస్థాయి పర్యటనలు చేసి స్వయంగా సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా తన మార్కును చాటుకున్నారు… ప్రస్తుత కలెక్టర్ తీరు కూడా అలాగే కనిపిస్తోందని పలువురు అంటున్నారు..
