ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఒక మోస్తరు వానజల్లులతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇప్పటికే జూన్ మొదటి వారంలోనే విత్తనాలు వేసిన పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆ విత్తనాలు మొలకెత్తక తీవ్రంగా నష్టపోయారు. కాగా ఇటీవల మళ్లీ రెండవసారి విత్తనాలు వేసిన రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వానలు ఆశలు కల్పిస్తున్నాయి.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 36 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 నుంచి 90 శాతం భూముల్లో పత్తి విత్తనాలు వేశారు దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పత్తి మొక్క, మొలవడమే గాక పలు ప్రాంతాల్లో పాటుకు వచ్చింది. కాగా ఎర్రజక్క నేలల్లో వేసిన విత్తనాలు మొలకెత్త క పోవటంతో రైతులు విత్తనాలను రెండుసార్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే వ్యవసాయ శాఖ అధికారులు సరైన తేమ రాకముందు విత్తనాలు వేయొద్దని రైతుల కు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు .
.ఆ మేరకు కొన్ని మండలాల్లో రైతులు తేమ సరిపోయే తరణం వరకు ఆగి విత్తనాలు వేశారు. అయితే జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురుస్తాయని నమ్మకంతో దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు వేసిన రైతులు ఆ విత్తనాలను నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులతో పలుచోట్ల ఇంకా మొలవని పత్తి చేలు కూడా మొలకెత్తే అవకాశాలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం, నమోదైన వర్షపాతం ఈ విధంగా ఉన్నాయి.
వర్షపాతం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మినహా అన్ని మండలాల్లోనూ జల్లులు కురిసాయి. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 29. 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా బోనకల్లు మండలంలో 1.0 మిల్లీమీటర్ వర్షం కురిసింది. అన్ని మండలాల్లో కలిపి 177.0 ఎన్ని మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు వర్షపాతం8.4 మిల్లీమీటర్లుగా నమోదయింది. సంతోషకరమైన విషయం ఏమంటే ఎంతో కొంత ప్రతి మండలంలోనూ వర్షపాతం నమోదయింది.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి 15.0, కామేపల్లి 4.6, రఘునాధపాలెం 4.6, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కూసుమంచి 10.2, నేలకొండపల్లి మండలంలో 1.2 మిల్లీమీటర్లు, ముదిగొండ మండలంలో 7.2, చింతకాని 1.4, ఖమ్మం అర్బన్ 1.2, కొనిజర్ల 17.0, ఏన్కూరు 4.6, కల్లూరు 5.6, పెనుబల్లి 7. 4, సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 29.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా వేంసూరు 20.4, తల్లాడ 7.0, వైరా 4.4, శాతం వర్షం కురువగా బోనకల్లు లో కేవలం ఒక్క మిల్లీమీటర్ వర్షం మాత్రమే కురిసింది. మధి ర10.0, ఎర్రుపాలెం మండలంలో 20.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
