టి యు డబ్ల్యు జే ఐ జే యు రాష్ట్ర మూడవ మహాసభలు ఖమ్మం నగరంలోని హరి కన్వెన్షన్ హాల్ లో బుధవారం తొలి రోజు ఘనంగా జరిగాయి. తొలిరోజు మహాసభలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

యూనియన్ అధ్యక్షులు నగునూని నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ జర్నలిస్టుల ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక సమగ్రమైన పాలసీని తెస్తున్నామని ప్రకటించారు. అదేవిధంగా హెల్త్ కార్డుల విషయంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి హెల్త్ కార్డు ద్వారా జర్నలిస్టులు అందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు, అక్రిడేషన్ ల కేటాయింపు విషయంలో కూడా ఒక సమగ్రమైన పాలసీని అమలు చేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత పది ఏళ్ల తర్వాత ఒక సమాచార శాఖ మంత్రి జర్నలిస్టుల సంఘం వేదిక పైకి వచ్చారని అన్నారు. పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిని కలిసి జర్నలిస్టులు సమస్యలు చెప్పుకునే అవకాశం లేదని కనీసం సమాచార శాఖ మంత్రి కూడా లేడని ఆ శాఖ అప్పట్లో అంతర్ధానమైందని వ్యాఖ్యానించారు.

. .. అతిథులకు ఘన సత్కారం..
ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్,
ఈ సభకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, తదితరులతో పాటు
గా ఐజేయు జాతీయ రాష్ట్ర నేతలను యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు
