ఖమ్మం పార్లమెంటు పరిధిలో చౌదరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు నామా నాగేశ్వరరావు కి పడ్డాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.. మరోపక్క బీజేపీ కూడా చౌదరి సామాజిక వర్గం తమకే ఓట్లు వేసిందంటూ ప్రచారం చేస్తుంది..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపు కోసం జిల్లాలోని చౌదరి సామాజిక వర్గం అంతా ఏకమై నిలిచిందనే చెప్పాలి. కానీ అదే సామాజిక వర్గం ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి కేటాయించాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేసింది. అలా చేయనందుకు ముఖ్యమంత్రికి బహిరంగ లేక అంటూ తమ నిరసనను కూడా తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఓట్లు అసెంబ్లీలో మాదిరిగా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ కు పడలేదని చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డిని అత్యత అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ తుమ్మలను గాడ్ ఫాదర్ గా భావించే చౌదరి సామాజిక వర్గం ఓట్లు కొన్ని ఆయన గీసిన గీత దాటి ఇతర పార్టీలకు పడ్డాయని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఖమ్మం జిల్లాలోని చౌదరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పూర్తిగా బి ఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు పడ్డాయని ఆయన మళ్లీ ఖమ్మం ఎంపీగా గెలవబోతున్నారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం యింది.
ఇది ఇలా ఉంటే బిజెపి నేతలు కూడా చౌదరి సామాజిక వర్గం ఓట్లు తమ పార్టీకి పెద్ద సంఖ్యలో వచ్చాయని పేర్కొంటున్నారు.
… చంద్రబాబు అరెస్టును ఖండించని పార్టీకి ఓట్లు వేశారా…
చౌదరి సామాజిక వర్గం ఓట్లు చంద్రబాబు అరెస్టు సమయంలో ఖండించకుండా వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పార్టీకి వేశారు అనడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ లోని ఒక వర్గం కొంత సపోర్ట్ చేసినప్పటికీ ఆ పార్టీలోని ఒక వర్గం బి ఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేది లేదని చెప్పడం కూడా చూశాం. అయితే తెలుగుదేశం పార్టీ మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పక్షాన నిలిచింది బహిరంగంగానే ఎన్నికల సభల్లో పాల్గొంది.
కానీ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పూర్తిస్థాయిలో కాంగ్రెస్ వైపు నిలబడలేదు ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం మూడు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి మద్దతుగా మారిపోయింది. అంటే ఆ పార్టీలోని చౌదరి సామాజిక వర్గం మూడు విధాలుగా చీలిపోయింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్కు చెందిన వారే ఉండడంతోపాటు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం కూడా ఉండటం, వీటన్నిటి దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని అంచనాలు విశ్లేషకుల్లో ఉన్నాయి,
అయితే టిఆర్ఎస్ కూడా గెలుపు పై ధీమాగానే ఉన్నప్పటికీ గెలుపు అంత తేలిక కాదనే అభిప్రాయాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిజెపికి ఈ ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే లక్షకు పైగా ఓట్లు వస్తాయని ఓటింగ్ శాతం బిజెపికి బాగా పెరుగుతుందనే అభిప్రాయాలు అయితే పరిస్థితి పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. మత మీద ఈ ఎన్నికల్లో చౌదరి సామాజిక వర్గం ఓట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
