ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ సోమవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో క్యూలో నిలబడి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకొని ప్రత్యేకతను చాటుకున్నారు.. తాను జిల్లా కలెక్టర్గా ఖమ్మం వచ్చిన నాటి నుంచి జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల నుంచి పార్లమెంటు, స్థానిక సంస్థలు , మళ్లీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు..

ఏ ఎన్నికలు వచ్చినా , నిర్వహణలో తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. గతంలో కూడా ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అభినందనలు , అవార్డులు అందుకున్న కలెక్టర్ ప్రస్తుతం జరిగిన పార్లమెంటు ఎన్నికల విషయంలోనూ , జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు.
పరిపాలన విషయంలో నిక్కచగా వ్యవహరించే తత్వం ఉన్న కలెక్టర్ వి పి గౌతం ,సాధారణ పౌరులకు అందాల్సిన సేవలు విషయంలో కూడా తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని, పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం చేయడంలోనూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా తమ గారాల పట్టి చిన్న పాపతో సహా వచ్చి క్యూలో నిలబడి ఓట్లు వేయడం కూడా జిల్లా ప్రజలను ఆకర్షించింది.
