తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

సైలెంట్ ఓటింగ్…ఖమ్మం సీటు ముగ్గురు మంత్రులకు ప్రతిష్టాత్మకం..75.19 శాతం పోలింగ్ నమోదయింది.భారీ మెజారిటీ ఖాయమంటున్న కాంగ్రెస్..చౌదరి ఓట్లపై నామ ఆశలు…లక్ష ఓట్ల అధికారులు మంటున్న బిజెపి..

Written by Mohiddin Shaik

సోమవారం ఖమ్మం పార్లమెంటు కు జరిగిన ఓటింగ్ సరళి సైలెంట్ గా సాగింది. ఆ సరళిని పరిశీలించిన ప్రధాన పార్టీల నేతలు రాజకీయ పరిశీలకులు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈసారి కూడా గత పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగానే 75.19 శాతం పోలింగ్ నమోదయింది..మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుతం జరిగిన పార్లమెంటు ఎన్నికల సరళకి చాలా వ్యత్యాసం ఉంది.

మునుపటి ఉత్సాహం ఓటర్లలో కనిపించలేదు మధ్యాహ్నం వరకు ఓటింగ్ మందకుడిగా సాగింది. దాదాపు 60 శాతం పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్ల క్యూ లైన్లు కనిపించలేదు. మధ్యాహ్నం తర్వాత మూడు గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. సాయంత్రం ఓటింగ్ పుంజుకుంది.

…. ఖమ్మం సీటు ముగ్గురు మంత్రులకు ప్రతిష్టాత్మకం..

ఖమ్మం పార్లమెంటు సీటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిష్టాత్మకంగా మారాయి . ఖమ్మం పార్లమెంటు పరిధిలో రికార్డు స్థాయిలో మెజారిటీ తెస్తామని పార్టీ అధిష్టానానికి ముగ్గురు మంత్రులు చెబుతూ వస్తున్నారు . ఈ ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో మెజారిటీ రాకపోతే అది తమ ప్రతిష్టకు భంగం అనే భావనలో ముగ్గురు మంత్రులు ఉన్నారు .

ఇదిలా ఉంటే ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు నుంచి ఒకసారి తెలుగుదేశం మరొకసారి బీఆర్ఎస్ నుంచి ఎంపీగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావు ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని యోజనలో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీలకు గాను 9 ఇంట్లో కాంగ్రెస్ విజయం సాధించగా ఒక్కసానంతో బిఆర్ఎస్ సరిపెట్టుకుంది ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటీవల కాంగ్రెస్లో చేరిపోవడంతో రాజకీయంగా భంగపాటుకు గురైన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో ఎంపి స్థానాన్ని గెలుచుకొని పోయిన ప్రతిష్టను నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

కాగా మరో ప్రధాన పార్టీ బిజెపి కూడా దాదాపు ప్రతి ఎన్నికల్లోను డిపాజిట్లు కోల్పోతున్న స్థితి నుంచి ఈసారి లక్షకు పైగా ఓట్లు సాధించాలని పట్టుదలతో ఉంది ఆ పార్టీ నేతలు దాదాపు గెలుపుకు దగ్గరగా వస్తాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

…. చౌదరి ఓట్లపై నామ ఆశలు…

ఖమ్మం జిల్లాలో చౌదరి సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గాడ్ ఫాదర్ గా భావిస్తారు అనే పేరు ఉంది, ఆ తర్వాత రెండవ వ్యక్తి నామా నాగేశ్వరరావును గాడ్ ఫాదర్ గా భావిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తుమ్మల నాగేశ్వరరావును మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక వర్గం గెలిపించింది. కాగా ఈసారి పార్టీలకతీతంగా పార్లమెంటు ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలిపించాలని ఆ సామాజిక వర్గంలోని మెజారిటీ ప్రజలు తీర్మానించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ అంశం తనకు కలిసి వస్తుందని బి ఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భావిస్తున్నారు. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి జిల్లా ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నామా నాగేశ్వరరావు పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ఓటమిపాలైనప్పటికీ వ్యక్తిగతంగా ఎంపీగా నామా నాగేశ్వరరావు పై వ్యతిరేకత లేనందున ఆ అంశం కూడా తనకు విజయాన్ని చేకూర్చుతుందనే ధీమా నామ వ్యక్తం.

అయితే రాజకీయ సమీకరణలు మారిన నేపథ్యంలో కాంగ్రెస్కే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్కు , వామపక్ష పార్టీల మద్దతుతో పాటు తెలుగుదేశం లోని ప్రధానమైన వర్గం కూడా మద్దతునిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడం కష్టమనే అభిప్రాయాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలుపు పై ప్రధాన పార్టీలు రెండు ధీమా వ్యక్తం చేస్తూ తమ అంచనాలు తాము చెబుతున్నారు మొత్తం మీద విజయం ఎవరిని వరిస్తుందో తేలాలంటే జూన్ 4వ తేదీ దాకా ఆగాల్సిందే.

About the author

Mohiddin Shaik

Leave a Comment