జాతీయం రాజకీయం

ప్రకృతి సంపద కోసమే నరమేధం..ఆపకుంటే ప్రతి ఘటన తప్పదు..-సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్…

Written by Mohiddin Shaik

ఖమ్మం: ప్రకృతి సంపద కోసమే ఛత్తీస్ గఢ్ లో బిజెపి సర్కార్ నర మేధం సృష్టిస్తుందని అపారమైన ఖనిజ, అటవీ -సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగమే ప్రభుత్వ హత్యలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. -ఛత్తీస్గఢ్లో జరుగుతున్న నర మేధం పై భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మంజిల్లా పక్షాన శనివారం పత్రికలకు ఒక ప్రకటన -విడుదల చేశారు.

దండకారుణ్యంలో అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని ఆ సంపదను ఇప్పటికే కొన్ని కార్పొరేట్ శక్తులకు లీజుల పేరుతో దారాదత్తం చేశారని దానికి అడ్డుగా నిలుస్తున్న వారందరిని మావోయిస్టుల పేరుతో హతమారుస్తున్నారని ప్రసాద్. -తెలిపారు. సైద్దాంతిక వైరుధ్యాలు ఉన్న మావోయిస్టు పార్టీ పంధా వేరైనా ప్రభుత్వం ఇలా నర మేధానికి పాల్పడడం సరైంది కాదన్నారు

చర్చలు జరిపే అవకాశం ఉన్నా బంధించి విచారణ జరిపే అవకాశం ఉన్నప్పటికీ అవేవి తమకు పట్టవన్నట్లుగా కనపడితే కాల్చివేత పద్ధతిని అమలు చేస్తున్నారని ప్రసాద్ తెలిపారు. బిజెపి ధోరణి ఇలాగే కొనసాగితే ప్రకృతి సంపదను కాపాడే వారి పైనా, ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న వారిపైనా సామాజిక, రాజకీయ కార్యకర్తల పైనా ఇదే రీతి అవలంభిస్తారని ప్రసాద్ తెలిపారు.

కార్పొరేట్ల కోసమే వేలాది మంది మిలటరిలను దించి ప్రాణాలను బలిగొంటున్నారని ఇందులో పార్టీ కార్యకర్తల కంటే అమాయక గిరిజన యువకులే ఎక్కువగా ఉన్నారని మహిళలను సైతం వదిలి పెట్టడం లేదని పోటు ప్రసాద్ -తెలిపారు. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న నరమేధంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని పోలీస్ ఉన్నతాధికారులు,

-ముఖ్యమంత్రులే మృతుల గురించి ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రసాద్ తెలిపారు. నరమేధం ఆపివేయాలని దండకారుణ్యంలో ప్రకృతి సంపదకు సంబంధించిన అన్ని లీజులను రద్దు చేయాలని ఏడాది కాలంగా =జరుగుతున్న పాశావిక ప్రభుత్వ హత్యాకాండపై విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని ప్రసాద్ తెలిపారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment