బి ఆర్ ఎస్ బిజెపి ఒక తాను మొక్కలే.. వారు నటించమంటారు వీరు నటిస్తారు.. రాష్ట్ర సంపద నుంచి ప్రజా ధనం నుంచి 1,30,000 కోట్లు కేసిఆర్ దోచుకున్నారు.. ఇక్కడ దోచుకుంది చాలక వేరే రాష్ట్రాల్లో కూడా డబ్బు కోసం ఆశపడ్డారు.. దాని ఫలితం ఢిల్లీ స్థాయిలో అనుభవిస్తున్నారు…ప్రపంచ అద్భుత ప్రాజెక్టు కాలేశ్వరం కట్టామని చెప్పుకుంటున్న కేసీఆర్.. కృంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ ను చూసేందుకు వెళ్లడం లేదు… అది చూడటానికి ఆయన అంతరాత్మ ఒప్పుకోవడం లేదు.. ఖమ్మం లో నామా నాగేశ్వరరావుకు డిపాజిట్ రాదు.. ఆయనను కేసీఆర్ కేంద్ర మంత్రిని ఎలా చేస్తారు… నిజంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణను ఏడు లక్షల కోట్లకు అప్పుల్లో ముంచేసిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు నమ్మరు… రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడి పని చేయాలి… రాష్ట్రంలో కారు పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్లు రావు…
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరేంజ్ లో ధ్వజమెత్తారు . బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలూ ఒక తాను ముక్కలేనని విమర్శించారు. ఎన్నికల ప్రచార చివరి రోజైన శనివారం కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డి, మిత్రపక్ష పార్టీల నాయకులతో కలిసి కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడతారని చెప్పారు. ఆయన హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఆ ప్రభుత్వ కాలంలోనే కుంగిందని తెలిపారు.
కేసీఆర్ పగటిపూటేమో బీజేపీపై విమర్శలు చేస్తూ.. రాత్రి అయ్యాక ఆ పార్టీ పెద్దలతో కూర్చొని.. మంతనాలు జరుపుతారని తెలిపారు. నిరుద్యోగుల బాధ, రైతుల కష్టాలు, మహిళాల ఆవేదన ఎప్పుడూ పట్టించుకోలేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయి, సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేక ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని అన్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కర్రుని ఎర్రగా కాల్చి వాత పెట్టడం ఖాయమని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ఎవరూ కట్టలేరని కేసీఆర్ గొప్పలు చెప్పాడని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీటలు వారి కుంగిపోయిందని, ఆ ప్రాజెక్టులో నీరు కిందికి లీక్ అయిపోతుంటే.. కనీసo స్పందించలేదని మంత్రి పొంగలేటి అన్నారు. లక్షలాది మంది రైతుల పంటలు ఎండిపోతున్నా, వారి తప్పులకు ప్రజలకు ఎక్కడ క్షమాపణ చెప్పాల్సి వస్తుందోనని, కాంగ్రెస్ వచ్చింది తాగునీటి కష్టాలు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
జైల్లో ఉన్న బిడ్డను, దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం
ఖమ్మం పర్యటనకు వచ్చి నామాను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానని అన్నాడని, బీజేపీతో వారి బంధం బయట పెట్టుకున్నాడని మంత్రి పొంగులేటి తెలిపారు. నామాకు ఇక్కడ డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. మీ జాతీయ పార్టీ ఏమైంది చంద్రశేఖర రావూ..? అంటూ ప్రశ్నించారు. 540 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టే దమ్ము ఆయనకు లేదని, తమ ఇండియా కూటమిలో కనీసం వేలు కూడా పెట్టనివ్వమని
