తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

శపధం కాదు, కాంగ్రెస్ సింహ గర్జన.. ! పతాకస్థాయికి ఎన్నికల సమరం..ప్రచారానికి మిగిలింది ఇక రెండు రోజులే ..

Written by Mohiddin Shaik

కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గెలుపు పై భారీ మెజారిటీపై శపధం కాదు సింహగర్జన చేస్తున్నారు…గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి సంచలన శపధం చేశారు… ఆ శబదంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు… ఎన్నికల తర్వాత ఆ శబదం అక్షరాల నెరవేరి ప్రకంపనలు సృష్టించింది…దాంతో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గెలుపు పై సింహగర్జన చేస్తున్నారు…మూడు నుంచి నాలుగు లక్షల మెజారిటీ హస్తానికి వస్తుందని గంటాపదంగా చెబుతున్నారు… ఇక కారు పార్టీ నేతలు కూడా ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు… ఇక బిజెపి కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది…

ప్రతి ఎన్నికల్లోను ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు ఒక సంచలనం … ఇక్కడి నేతల ప్రచార శైలి కూడా సంచలనమే… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి కారు పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే ని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అన్న శపథం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది…

ఆ శవదానికి అంత ప్రచారం రావడానికి కారణం , చెప్పినట్టే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలవడం , ఒక్కరు గెలిచినప్పటికీ కారు పార్టీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోని చేరిపోవడం… ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడు నుంచి నాలుగు లక్షల మెజారిటీ సాధిస్తుందంటూ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ముక్త కంఠంతో చెబుతున్నారు ఇది సవతం కాదు సింహగర్జన అన్నట్లు వారిలో తునికి సలాడుతున్న ధీమా కనిపిస్తోంది……

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయం రాష్ట్రంలోనే సంచలన విజయంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. భారీ మెజారిటీని నమోదు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకతను చాటుకోవాలని ముగ్గురు మంత్రులతో సహా కాంగ్రెస్ నేతలు పట్టుదలతో పని చేస్తున్నారు. వారి ధీమాకి కారణం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేయడమే కాక రైతుల రెండు లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు నాటికి ఖచ్చితంగా అమలు చేస్తామని నమ్మకాన్ని రైతుల్లో కలిగించారు.

దాంతోపాటు ఆగస్టు 15 నాటికి గోదావరి జలాలను వైరా నదిలోకి అనుసంధానం చేయడం ద్వారా 3 లక్షల ఎకరాల భూములకు సాగునీరు ఇవ్వబోతున్నామని నమ్మకాన్ని కూడా రైతుల్లో కలిగించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సాగర్ మూడవ జోన్ కింద ఉన్న మధిర నియోజకవర్గం పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టును ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి రెండవ జోన్ కిందకు మార్పు చేస్తూ జీవో తెచ్చారు.

ఈ చారిత్రక మార్పు పట్ల రైతు లోకం డిప్యూటీ సీఎంకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక భావితరాలకు కూడా ఈ మార్పు బాగా ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం రుణం తీర్చుకోవాలని కృతజ్ఞతా భావాన్ని రైతాంగం బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇక సీతారామ లింక్ కెనాల్ వైరా నదికి అనుసంధానం చేసే విషయంలో ఇటు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సహకారంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శరవేగంగా పనులు పూర్తి చేయించేందుకు అడుగులు వేస్తున్న తీరు కూడా రైతాంగంలో సంతోషాన్ని నింపుతోంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ధీమాకు ప్రధాన కారణం రైతుల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఇక బి ఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా తన పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణం తన గెలుపుకి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఖమ్మంలో స్థానికుడిగా పదేళ్లపాటు ప్రజా జీవితంతో మమేకమై ఉన్న నామా నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా అన్ని వర్గాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆ పార్టీ చేసిన అభివృద్ధి లేదా ఇంకా ఏదైనా ప్రజలకు అంతగా నచ్చని అంశాలు ఉన్నప్పటికీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వివాద రహితుడనే ఒక మంచి అభిప్రాయం నామాకు కలిసొస్తుందని ధీమా ఆ పార్టీ నేతల్లో.మూడో ప్రధాన పార్టీగా ఉన్న బిజెపి కూడా ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లు సాధించాలని ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి మోడీ చరిష్మా ఇక్కడ కూడా పనిచేసే విజయం కూడా చేకూరవచ్చని ఆత్మవిశ్వాసంతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

About the author

Mohiddin Shaik

Leave a Comment