క్రైమ్ వార్తలు జాతీయం ప్రత్యేక కథనాలు

కన్నీరొలికిన మున్నేరు…!ముగ్గురు చిన్నారులను మింగిన నీటి గుంత…మున్నేరు వద్ద మిన్నంటిన రోదనలు… ప్రాణాలు తీసిన ఈత సరదా..

Written by Mohiddin Shaik

మున్నేరులో నీటితో నిండిన పిల్లర్ గుంత ముక్కుపచ్చారని ముగ్గురు చిన్నారుల ను మింగేసింది… ఆ చిన్నారుల మృతదేహాలను బయటికి తీస్తుంటే తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి… ఆ దృశ్యం చూసి మున్నేరే కన్నీరు పెట్టుకుంటుందా అన్నంతగా చూసిన ప్రతి ఒక్కరి గుండెలు బరువెక్కాయి… తమ బిడ్డలే సర్వస్వం అనుకుని ప్రాణప్రదంగా పెంచుకుంటున్న తల్లిదండ్రులు తమ ఇంటి దీపాలు ఆరిపోయాయి అని తెలిసి తల్లడిల్లిన తీరు కన్నీరు పెట్టించింది… ఈ హృదయ విదారక దుర్ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేరు వద్ద గురువారం జరిగింది… వివరాలు తెలుసుకుందాం రండి…

ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బరిగొన్న విషాదకర సంఘటన ఖమ్మం రూరల్ మండలంలోని గుడిమల్ల వద్దగల మున్నేటిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

ఖమ్మం నగరం మమత హస్పిటల్​ వెనకాల నివాసం ఉంటున్న అముదాల చిరంజీవి కుమారులు అముదాల లోకేష్​ (13) అముదాల హరిష్​(9) పక్కింటి అబ్బాయి బాణోత్​ గణేష్​లు తండ్రి అముదాల చిరంజీవి సమీపంలో గల దంసలాపురం వద్ద గల మున్నేరులో చేపల వేటకు వెళ్తుండగా మా తుమ్మడు తండ్రి అముదాల కుమారులు వీరి స్నేహితుడు కలిసి గురువారం ఆటోలో మున్నేరులో ఈత కొట్టేందుకు వెళ్లారు.

మున్నేరు పై హైవే పనులు జరుగుతున్నాయి. వంతెన వద్డ పెద్ద లోయ ఉన్న విషయాన్ని గమనించని ముగ్గురు చిన్నారులు ఆ లోయలో దూకి నీట మునిగారు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కాపాడబోయే సరికే అప్పటికి అ చిన్నారులు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్​ ఎస్​ఐ రామరావు సంఘటన స్థలానికి చెరుకుని గాలింపు చర్యలు చేపట్టి శవాలు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పసిటల్​కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment