రాజకీయం

పొంగులేటి వైపే అధిష్టానం మొగ్గిందా…!

కాంగ్రెస్ వర్గాల్లో ఎడతెగని చర్చ

ఖమ్మం కాంగ్రెస్ టికెట్ పొంగులేటి సోదరుడికి దక్కన్ ఉందా… దాదాపు ఆయన పేరును ఇప్పటికే ఖరారు చేశారని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది.

ఇటీవల జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ హైదరాబాద్ లో జరిపిన సమావేశాల్లో ప్రసాదరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తీర్థం రెడీ అయింది ఇక శంకులో పోయడమే మిగిలి ఉంది అనే చందంగా అభ్యర్థి పేరును అధిష్టానం ప్రకటించడమే మిగిలి ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో బలంగా జరుగుతుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించే విషయంలో ఇంకా సాగదీతపై ఆ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పదింటిలో మిత్రపక్షంతో కలిపి తొమ్మిది అసెంబ్లీలను గెలుచుకున్నప్పటికీ ఎంపి ఓట్ల విషయానికి వచ్చేవరకు గతంలో టిఆర్ఎస్ వైపు జిల్లా ప్రజలు మోగ్గారు. గత పార్లమెంటు ఎన్నికల్లోను బి ఆర్ ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు కూడా పార్లమెంటు కంటే ముందు జరిగిన ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ను ఇతర విపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించారు.

2014 తెలంగాణ తొలి ఎన్నికల నుంచి మొన్నటి ఎన్నికల వరకు మూడుసార్లు కూడా విఆర్ఎస్ కు వచ్చింది ఒక్కటే అసెంబ్లీ స్థానం. 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు గెలుపొందగా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే కారు గుర్తుపై గెలిచారు. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి డాక్టర్ తెల్లం వెంకటరావు ఒక్కరే విజయం సాధించారు. అయితే 2014 జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా అప్పటి వైఎస్ఆర్సిపి తరఫున ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించగా, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపొందారు. కాగా ఇప్పుడు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు నామ నాగేశ్వరరావు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు.

అయితే గతానికి ఇప్పటికీ తేడా ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు ఈసారి ఎంపీ ఓట్లు కూడా కాంగ్రెస్కే ప్రజలు వేస్తారని ఆ పార్టీ నేతలు బలంగా పేర్కొంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనే అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిని రేణుక చౌదరి ఒక విధంగా తన విజయాన్ని తానే చేజార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయని కొందరు పేర్కొంటున్నారు.ఆ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా ఉన్నప్పటికీ ఆమెకు నాలుగు లక్షల ఓట్లు వచ్చిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.

ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ నుంచైనా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని అన్ని చోట్ల కాంగ్రెస్ బలంగా ఉందని అందుకే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ గెలుపు నల్లేటిపై నడకేనని ఆ పార్టీ నేతలు గంటా చెబుతున్నారు. అయితే అభ్యర్థి ఎంపిక చివరిదాకా బయట పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్కంఠను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం సందర్భాన్ని బట్టి టిక్కెట్టు ఎవరికైనా కేటాయించవచ్చు అనే చర్చ కూడా ఉంది ఖమ్మం టికెట్ కోసం హేమాహేమీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఖమ్మం టికెట్ వస్తే చాలు పార్లమెంటుకు వెళ్లినట్టే అని అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

About the author

Mohiddin Shaik

Leave a Comment