క్రైమ్ వార్తలు జాతీయం

ఎత్తురోడిన పచ్చని అడవులు…ఎదురు కాల్పుల్లో 29 మంది నక్సల్స్ మృతి.. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట..

Written by Mohiddin Shaik

పచ్చదనం పరుచుకున్న దండకారణ్యంలో నెత్తుటేరులు పారుతున్నాయి… చిక్కనైన చెట్ల మధ్య పక్షుల కిలకిలా రావాలి వినిపించడం లేదు… పేలుతున్న తుపాకీ తూటాల శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి… మంగళవారం చతిస్గడ్ అడవుల్లో పోలీసు ఎదురుకాల్పుల్లో 29 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు…

ఈ మృత్యు క్రీడ ఇంకెంతకాలం కొనసాగుతుందో… ఒకపక్క సైదాంతిక పోరాటం చేస్తున్నామని భావిస్తున్న వారు, మరోపక్క ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నామని భావించేవారు… ఇద్దరూ మనుషులే ఎవరికి అవకాశం చిక్కినప్పుడు వారు తమ తమ శత్రువుగా భావించే వారిని చంపడమే జరుగుతోంది. ఈ క్రీడలో పోలీసులు ఎంతమంది నక్సల్స్ చంపితే పంపిన వారి దృష్టిలో అంత గొప్ప.

ఇక పోలీసులను ఎంత మందిని చంపితే నక్సల్స్ పోరాట వీరుల దృష్టిలో అంత గొప్పగా పోరాడినట్టు లెక్క. కానీ ఈ యుద్ధంలో ఇరువైపులా మృత్యువుడికి చేరుతున్న వారు ఇద్దరు మనుషులే, ఇద్దరూ మనవాళ్లే.. అడవులన్నీ జల్లెడ పట్టి నక్సలైట్ల ను మట్టు పెట్టడం వీలు కలిగితే ప్రభుత్వానికి లొంగిపోయేటట్లు చేయడమో చేస్తున్న పని. ఈ మారణ హోమానికి ముగింపు ఎప్పుడో….

ఎదురు కాల్పుల్లో 29 మంది నక్సల్స్ మృతి చెందారు భాస్కర్ ఐజి సుందర్ రాజ్…

మంగళవారం చత్తిస్గఢ్లోని కాంకేర్ జిల్లా చోటే బైద్య పోలీస్ స్టేషన్ పరిధిలో కల్చరల్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది నక్సల్స్ మృతి చెందినట్లు బస్తర్ జిల్లా ఐజి సుందర్ రాజ్ మీడియాకు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఎదురు కాల్పుల్లో కొంతమంది పోలీస్ జవాన్లకు కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయని వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్కౌంటర్ సందర్భంగా ఏకే 47 గన్స్ తో సహా కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment