సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండా లు వదిలేసి పదవి కోసం పరుగులు తీసే కొందరు లీడర్లు దీపపు పురుగు లాంటివారు… కప్పలతో పోటీపడి ఇటువంటి గొప్ప లీడర్లు ఎప్పటికీ ఏ పార్టీలో ఉంటే అప్పటికి ఆ పార్టీ గొప్ప ఆ పార్టీ నేత దేవుడు అంటూ కీర్తిస్తారు.. ఇప్పుడు ఇలాంటి గొప్ప లీడర్లతో ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతోంది…
ఎన్నికల యుద్ధంలో పోరాడే నీతి మారింది.. ఎన్నికల యుద్ధంలో విలువల జాడ కనిపించడం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు.. కప్ప దూకుడు గొప్ప లీడర్ల సందేశాలు శ్రద్ధగా వినే ప్రజలు ఈ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు..ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడటం తప్పు కాదేమో కానీ అలా సందేశం వినిపించే నేతల మాటలకు తలలూపే ప్రజల స్థితి ఏమిటనే ప్రశ్న మేధావుల్లో తరచూ తలెత్తుతోంది .
……నోటు తో ఓటు కొనడం అనైతికమా…!
ఎన్నికల యుద్ధంలో విలువలు పాటించడం సాధ్యం కాదా.. .నోటు తో ఓటు కొనడం అనైతికం, నేరం. అయినా ఈ విషయాన్ని ప్రధాన పార్టీలు ఎప్పుడైనా పరిగణలోకి తీసుకుంటున్నాయా.., ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ నేత వేరే పార్టీ డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తుంది డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మాకు వేయండి అని చెబుతాడు. మరో పార్టీ నేత కూడా అదే మాట చెబుతాడు. ఇంకో పార్టీ నేత మేము డబ్బు పెట్టి ఓట్లు కొనే పార్టీ కాదు మాది మా అభివృద్ధిని చూసి ఓటు వేయండి అంటాడు. ఈ ప్రసంగాలు వినే ప్రజలకు ఎవరు నోటు ఇచ్చి ఓటు అడుగుతారో తెలుసుకోలేనంత అమాయకులు అంటారా..
అసలు ఈ నీతులు చెప్పే నేతలు నోటు పంపేది ఎవరి వద్దకు ఈ ప్రసంగాలు వినే వారి వద్దకు కాదా.. ఏ పార్టీ ఎంత ఇచ్చిందో ఓటరుకు బాగా తెలుసు.. ఇది నీతిమాలిన చర్య కావచ్చు, కానీ ఆ సాంప్రదాయాన్ని అందిపుచ్చుకొని ఓటు ఇస్తేనే ఓటు వేయడానికి వస్తాం అని ఓటర్లు నీతిని పాటించాల్సిన అవసరం లేదా అంటే కచ్చితంగా ఉంది.
పార్టీలు అధికారం కోసం అడ్డదారుల్లో ఓట్లు సంపాదించాలని ఆశిస్తే ఏదో ఒక దారిలో తమ చేతికి డబ్బు రావాలని ఓటర్లు ఆశించడం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రలోభాల్లో ఇది ఒక అంశం మాత్రమే అనేక అంశాలు విలువలకు కిలోల తిలోదకాలు ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందడం సర్వసాధారణంగా మారిందని కొందరు విమర్శిస్తున్నారు. ఎన్నికలవేళ ఈ లోపాలపై చర్చించుకోవడం తప్ప వీటిని అడ్డుకునే ప్రయత్నం విజయవంతం కాదని అందరికీ తెలుసు..
