తాము పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు… గతంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ కొత్త చట్టాలపై తిరుగుబాటు చేసి నెలలు తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన విషయం తెలిసిందే… ఇప్పుడు అదే రైతు సంఘాల ఐక్య కారాచరణ ఆధ్వర్యంలో తమ పంటలకు కనీసం మద్దతు ధర కు సంబంధించి చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
దాంతో పాటు మరికొన్ని డిమాండ్లతో రైతు సంఘాలు జాతీయస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా బుధవారం చలో ఢిల్లీ మార్చ్ అనే కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపునందుకొని రైతులు వేల సంఖ్యలో ఢిల్లీ వైపు వెళుతుండగా సరిహద్దుల్లో కేంద్ర పోలీస్ బలగాలు అడ్డగించాయి.. ఈ సందర్భంగా రైతులపై పోలీసు బలగాలు టిఆర్ గ్లాస్ తూటాలను ప్రయోగించారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..
