అంతర్జాతీయ ప్రమాణాలతో శాస్త్ర సాంకేతిక ఆంగ్ల విద్యతో పాటు హైందవ మత ధర్మంలోని విష్ణు నారాయణుని ఆధ్యాత్మిక సద్విద్య, బ్రహ్మ విద్యలను బోధించే శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలను ఖమ్మంలో నెలకొల్పనున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఖమ్మం జిల్లాలో 100 ఎకరాల స్థలం కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కోరినట్లు తెలిసింది. దానికి మంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి 100 ఎకరాల స్థలం కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సంస్థ ప్రతినిధి బృందంతో మాజీ మంత్రి జలగం ప్రసాదరావు మంత్రుల వద్దకు వచ్చి అనుసంధాన కర్తగా వ్యవహరించినట్లు సమాచారం .
స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ పాఠశాలలను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో తిరుపతి, పులివెందుల, విశాఖపట్నంలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సంస్థ కోరిన విధంగా జగన్ ప్రభుత్వం 100 ఎకరాల స్థలం కూడా కేటాయించినట్లు సమాచారం. సీఎం జగన్ ను కలిసిన సందర్భంలోనూ జలగం ప్రసాదరావు ఆ సంస్థ ప్రతినిధి బృందంతో వెళ్లినట్లు సమాచారం.
. … గురువుల నేతృత్వంలో నడిచే సంస్థలు…
ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాసంస్థల మాతృ సంస్థ పేరు బోచ సన్వాసి ..అక్షర పురుషోత్తం ..
స్వామి నారాయణ సదన్ ..( బి .ఏ .పి.ఎస్ ) ఈ సంస్థను190 5 వ సంవత్సరంలో యోగ్న పురుష దాస్ ( శాస్త్రి మహారాజ్ )
స్థాపించారు.
ఆ సంస్థ విద్య బోధన కార్యకలాపాలు 1907 జూన్ నుంచి ప్రారంభించారు. అంటే 116 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3850.శాఖలను నడుపుతూ ప్రపంచ స్థాయి విద్యను అందిస్తోంది.
బి .ఏ. పి. ఎస్ , ఆరవ గురువు గుణా తీతానంద స్వామి ( మహంతి స్వామి మహారాజ్ ) ఆగస్టు 2016 నుంచి నేతృత్వం వహిస్తున్నారు. ఆ సంస్థకు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. దీన్ని మొట్టమొదట గుజరాత్ లోని రాజ్కోట్ లో స్థాపించారు . ఈ విద్యాసంస్థలో చదువు అత్యున్నత స్థాయిలో ఉంటుందనే చర్చ ఉంది . ఇందులో చదివే విద్యార్థు లకు విద్యతో పాటు క్రమశిక్షణకు సంస్థ అధిక ప్రాధాన్యతని ఇస్తుందనే పేరు ఉంది. హిందూ ధర్మ ప్రధానంగా స్థాపించబడిన ఈ విద్యాసంస్థలో అకాడమీకు విద్య కూడా ప్రతిష్టాత్మకంగా నేర్పుతారనే పేరుంది. నర్సరీ నుంచి ఇంజనీరింగ్ వరకు అన్ని రకాల కోర్సులు ఉంటాయంటున్నారు.
ఖమ్మం జిల్లాలో స్వామి నారాయణ గురుకుల పాఠశాలలు వస్తే , ఎవరికి ఏ విధమైన విద్య అవసరము ,అది నేర్చుకోవచ్చు. స్వామి నారాయణ సాంప్రదాయ హైందవ ధార్మిక విద్య వికాసం కోరుకునే వారికి ఇది అంది వచ్చిన అవకాశంగా భావించవచ్చు. అదే సందర్భంలో ఇతర కోర్సులలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య నేర్చుకునే అవకాశం కూడా లభించనుంది.
