ప్రత్యేక కథనాలు

ఐజేయు రాష్ట్ర నాయకులు కే రామనారాయణ ను పరామర్శించిన జర్నలిస్టు నాయకులు..

Written by Mohiddin Shaik

టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం పరామర్శించారు , ఆయన ఈ సందర్భంగా రామ్ నారాయణ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు .

అదేవిధంగా జర్నలిస్టు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పరామర్శించారు. రామ్ నారాయణ ఇటీవల హైదరాబాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయనకు గుండెకు ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైస పాపారావు, నగర నాయకులు ఉషోదయం శ్రీనివాస్, జిల్లా నాయకులు జనతా శివ, యోగి నాటి మాధవరావు తదితరులు పరామర్శించారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment