19 ఏళ్ల నుంచి నలుగురు బంగ్లా దేశీయులు ఖమ్మంలో ఉంటున్నారా…! అది అక్రమంగా , నిబంధనలకు విరుద్ధంగా …ఏకంగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ,,పాన్ కార్డులు ….కొందరైతే పాస్పోర్ట్ లు కూడా పొందారట.!. ఎట్టకేలకు 19 ఏళ్ల తర్వాత వారి గుట్టు రట్టయింది….ఖమ్మం 3 టౌన్ పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారట …వివరాలు ఇలా ఉన్నాయి
అక్రమంగా బెంగళూరుకు తమ పేర్లను మార్చుకొని ఆధార్, ఆ తర్వాత ఓటు హక్కు ,పాన్ కార్డు , పాస్పోర్ట్ కూడా సృష్టించుకుని ఖమ్మంలోనే జీవనం సాగిస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. వారిని ఖమ్మం పోలీసులు పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
నగరంలో ఎవరైనా విదేశీయులు అక్రమంగా ఎక్కడైనా ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం చెప్పాలని ఆయన నగర పౌరులకు సూచించారు.. అరెస్ట్ అయిన వారిలో బంగ్లాదేశ్ దేశానికి చెందిన శ్యాంకుర్ యూనియన్ లోని జనైత జిల్లా ,మహేష్ పూర్ సబ్ జిల్లా గురుదా పోస్ట్ డకాటియా గ్రామానికి చెందిన నిందితుడు మహమ్మద్ నూర్ నబి అలియాస్ షేక్ నూర్ నబి( 32 ) ఏ 1 గాను, రెండవ నిందితుడిగా మహమ్మద్ సాగర్ అలియాస్ బోడ సాగర్ (24 ), మూడవ నిందితుడిగా, షేక్ జమీర్ అలియాస్ మహమ్మద్ జమీర్ (30 ), నాలుగవ నిందితుడిగా ,మహమ్మద్ అమినోర్ మండల్ (26 )ఉన్నారని , సిపి తెలిపారు.
మొదటి నిందితుడికి సోదరి, మూడవ నిందితుడికి దూరపు బంధువైన సాగురి, ఖాతూన్ అలియాస్ శిల్ప అనే మహిళలు చాలా సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి అక్రమంగా కలకత్తా , ముంబైకి వచ్చి , బోడ రాములతో కలసి సహజీవనం చేసి, పనుల కోసం ఖమ్మం వచ్చి శ్రీనివాస నగర్ లో నివాసం ఉండే వారని పేర్కొన్నారు .
ఈ క్రమంలో ముందుగా బంగ్లాదేశ్ లో ఉండే సోదరులు అయిన నిందితుడు మహమ్మద్ నూర్ నబి షేక్ నూర్ నబి తర్వాత , నిందితుడు మహమ్మద్ సాగర్ బోడాసాగర్ కొంతకాలం తర్వాత బంధువైన మూడవ నిందితుడు షేక్ జమీర్ మహమ్మద్ జమీర్ కూడా అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఖమ్మం నగరంలో శ్రీనివాస నగర్ లో ఉంటున్న సోదరి ఇంటికి చేరుకున్నారని సిపి పేర్కొన్నారు .
మొదటగా ఆధార్ కార్డులు ఇస్తున్న సమయంలో ఖమ్మం వర్తక సంఘ భవనంలో వెళ్లి ఎటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఆధార్ కార్డును పొందారు . అప్పుడు పేరు మొహమ్మద్ నూర్నబి అయినప్పటికీ, షేక్ నూర్ నబిగా తప్పుగా చూపించి ఆధార్ కార్డు పొందాడని, అదే పద్ధతిలో మిగిలిన ముగ్గురు నిందితులు కూడా ఆధారాలు లేకుండా అక్రమ పద్ధతిలో పాన్ కార్డులు పాస్పోర్ట్ పొంది ఖమ్మంలో ఉంటున్నారని ఆయన తెలిపారు వారిలో కొందరు సెంట్రింగ్ పని చేస్తున్నారని ఇంకొందరు పండ్ల వ్యాపారం వంటివి చేసి భారీ ఆ పిల్లలతో 19 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని ఆయన తెలిపారు.
